టాస్‌తో మొదలైంది ఆట కాదు... వాన! | RCB Knocked Out After Rain Washes Out Thriller Against Rajasthan | Sakshi
Sakshi News home page

టాస్‌తో మొదలైంది ఆట కాదు... వాన!

Published Wed, May 1 2019 7:50 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ఐపీఎల్‌లో అందరి కంటే ముందే రేసు నుంచి తప్పుకున్న జట్టు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు. ఎటొచ్చి రాజస్తాన్‌ రాయల్స్‌కే మ్యాచ్‌తోనూ, గెలుపుతోనూ పని ఉంది. కానీ వర్షం ఆగేదాకా నిరీక్షించి బరిలోకి దిగినా మళ్లీ వెంటాడిన వర్షం రాయల్స్‌ను నిండా ముంచేసింది. బెంగళూరులో మంగళవారం రాత్రి కురిసిన హోరు వానలో రాజస్తాన్‌ ‘ప్లేఆఫ్‌’ ఆశలు దాదాపుగా కొట్టుకుపోయాయి. చిన్నస్వామి స్టేడియాన్ని పెద్ద వాన తడిపేసింది. పొట్టి ఫార్మాట్‌లోనే నాలుగో వంతు పొట్టి మ్యాచ్‌ను (5 ఓవర్ల) మొదలుపెట్టినా... పూర్తి కాకుండానే ఆగిపోయింది.  మ్యాచ్‌ రద్దు కావడంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్‌ కేటాయించారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement