ప్లీజ్... గెలవండి! | vijay mallya urges rcb to lift ipl 7 trophy | Sakshi
Sakshi News home page

ప్లీజ్... గెలవండి!

Published Thu, Apr 17 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 AM

ప్లీజ్... గెలవండి!

ప్లీజ్... గెలవండి!

ఆటగాళ్లను కోరిన మాల్యా
 షార్జా: ఈసారి ఎలాగైనా ఐపీఎల్ ట్రోఫీని గెలవాలని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ యజమాని విజయ్ మాల్యా తన మనసులోని కోరికను ఆటగాళ్ల ముందు బయటపెట్టారు.
 
క్రికెటర్లతో జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి సాదర స్వాగతం పలికిన మాల్యా భారీ మొత్తానికి కొనుగోలు చేసిన యువరాజ్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ‘మీరు ఏదైనా చేయగలరు. ఆ విషయం మీకు తెలుసు. ఐపీఎల్-7 ట్రోఫీని మనం అందుకోవాలి. జట్టులో మంచి వాతావరణం ఉంది. కాబట్టి శ్రమిస్తే ఫలితం అనుకూలంగా వస్తుంది’ అని మాల్యా వ్యాఖ్యానించారు. షార్జాలో గురువారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఆర్‌సీబీ ఐపీఎల్‌లో తమ పోరును ప్రారంభిస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement