ఆ లెక్కన ట్రోఫీ సన్‌రైజర్స్‌దే! | History Repeat Sunrisers Will win IPL Trophy | Sakshi
Sakshi News home page

Published Fri, May 25 2018 3:31 PM | Last Updated on Fri, May 25 2018 3:31 PM

History Repeat Sunrisers Will win IPL Trophy - Sakshi

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు(ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌ : గత సీజన్‌ సెంటిమెంట్‌ పునరావృతమైతే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌నే ఐపీఎల్‌ ట్రోఫీ వరించనుంది. 2017 సీజన్‌ టైటిల్‌ను ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది సీజన్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న తొలి రెండు జట్లే ఫైనల్‌కు చేరాయి. అంతేకాకుండా టాప్‌ ప్లేస్‌లో ఉన్న జట్టుకే టైటిల్‌ దక్కింది. ఆ సీజన్‌లో టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్‌ రెండో స్థానంలో ఉన్న అప్పటి జట్టు రైజింగ్‌ పుణెతో క్వాలిఫైయర్‌-1 మ్యాచ్‌లో ఓటమిపాలైంది. పుణె జట్టులో ధోని ఉండటం విశేషం. క్వాలిఫైయర్‌-2లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఇక ఫైనల్లో పుణెతో తలపడి ఉత్కంఠ పోరులో టైటిల్‌ను సొంతం చేసుకుంది. 

హిస్టరీ రిపీట్‌..
ఈ సీజన్‌లో టాప్‌లో ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సైతం రెండో స్థానంలో ఉన్న ధోని సారథ్యంలోని చెన్నైసూపర్‌ కింగ్స్‌ చేతిలో ఓటమి పాలైంది. మళ్లీ క్వాలిఫైర్‌-2 మ్యాచ్‌ కూడా అప్పటిలా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరగనుండటం విశేషం. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ నెగ్గితే చరిత్ర పునరావృతం అవుతోంది. ఆ లెక్కన టైటిల్‌ సన్‌రైజర్స్‌నే వరించే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement