న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్ ఇవ్వబోతున్నడనే వార్తలు ప్రస్తుతం హల్‌చల్ చేస్తున్నాయి. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు ధావన్ వీడ్కోలు పలుకుతున్నట్టు తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీ వహిస్తున్న ముంబై ఇండియన్స్‌కు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు సమాచారం. వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్ ధావన్ ఆడబోతున్నట్లు.. ముంబై మిర్రర్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. 2013 నుంచి సన్‌రైజర్స్‌తో కలిసి కొనసాగుతున్న ధావన్.. తనకు సహచర క్రికెటర్లు కోహ్లి(17 కోట్లు), రోహిత్‌శర్మ(15 కోట్లు), ధోని(15 కోట్లు) పోలిస్తే 5.2 కోట్లు మాత్రమే దక్కతుండటమే అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది.
ప్రస్తుతం భారత జట్టులో శిఖర్ ధావన్ రెగ్యులర్ ఓపెనర్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తన స్థాయికి తగిన ఫీజు రావడం లేదని గబ్బర్ అసంతృప్తితో ఉన్నాడట. ఈ మేరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వీడేందుకు తాను అనుకూలంగా ఉన్నానని ఫ్రాంచైజీ యాజమాన్యంతో ధావన్ చెప్పినట్టు తెలుస్తోంది. భారత జట్టులో టాప్-4 స్థానంలో ఉన్న తనను ఎందుకు రిటైన్ చేసుకోలేదని హైదరాబాద్ కోచ్ టామ్ మూడీతో శిఖర్ అంతకు ముందు వాదించాడట. గత ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ అతడిని రిటైన్ చేసుకొని ఉంటే రూ.12 కోట్లు లేదా రూ.8.5 కోట్లు దక్కేవి. అలా కాకుండా ఆ జట్టు డేవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్‌ను రిటైన్ చేసుకుంది. గబ్బర్‌ను రైట్ టు మ్యాచ్ కింద తీసుకుంది. దీంతో తనకు ప్రాధాన్యం లేదని గబ్బర్ భావిస్తున్నట్లు సమాచారం.ఒకవేళ ముంబై ఇండియన్స్‌తో చర్చలు సఫలమైతే ధావన్ ముంబై ఇండియన్స్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే రోహిత్‌తో కలిసి ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్‌గా బరిలో దిగే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment