
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు(ఫైల్ ఫోటో)
సాక్షి, బెంగళూరు : ఐపీఎల్-11లో వరుస విజయాలతో ఊపుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే ప్లే ఆఫ్‌కు చేరుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు లీగ్‌లో 12 మ్యాచ్‌లు ఆడి తొమ్మిదింట నెగ్గి పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ ఆగ్రస్థానంలో కొనసాగుతోంది. గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌తో, శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు గెలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకోవాలని ఆరెంజ్ ఆర్మీ ఉవ్విళ్లూరుతోంది.
ఒక సీజన్‌లో లీగ్ మ్యాచ్‌ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్లు రాజస్తాన్ రాయల్స్(11 విజయాలు; 2008), కింగ్స్ పంజాబ్(11 విజయాలు; 2014) జట్లు మాత్రమే. ఇప్పుడు రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి ఆ టీమ్‌ల సరసన నిలవాలని సన్‌రైజర్స్ తాపత్రయపడుతోంది. ఇక ఇప్పటివరకు ఒక సీజన్‌లో సన్‌రైజర్స్ అత్యధిక విజయాలు 10 (2013లో) మాత్రమే. లీగ్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే 11 విజయాలు సాధించినట్లు అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment