భార్య స్ట్రైక్‌లో ఉంటే భర్త ఏం చేస్తాడు | Shikhar Dhawan says Batsman on the ground And bowler off the ground | Sakshi
Sakshi News home page

భార్య స్ట్రైక్‌లో ఉంటే భర్త ఏం చేస్తాడు

Published Sat, Mar 31 2018 9:55 AM | Last Updated on Sat, Mar 31 2018 10:09 AM

Shikhar Dhawan says Batsman on the ground And bowler off the ground - Sakshi

టీమిండియా ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ క్రికెట్‌తో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటాడు. అయితే అందరూ భర్తల్లాగే తాను కూడానని, అందుకు తానేం అతీతుడిని కాదంటూ ఓ ఫన్నీ ట్వీట్ చేస్తూ వీడియో అప్‌లోడ్ చేశాడు ధావన్. 'క్రికెట్ మైదానంలోనే నేను బ్యాట్స్‌మెన్‌ని. కానీ మైదానం వెలుపల నేను బౌలర్‌గా మారిపోయాను. భార్య స్ట్రైకింగ్ తీసుకుంటే ఏ భర్తయినా ఇంతకంటే ఏం చేయగలడు. కుటంబంతో గడిపే క్షణాలను ఎప్పుడూ ప్రేమిస్తానంటూ' ధావన్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఈ డాషింగ్ ఓపెనర్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ధావన్ బౌలింగ్ చేస్తుండగా భార్య బ్యాటింగ్ చేయడం వీడియోలో చూడవచ్చు. వీరి పిల్లలు ఫీల్డర్లుగా మారిపోయి తండ్రి ధావన్‌కు సాయం చేస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వారం రోజులు కుటుంబంతో సంతోషంగా గడపాలి అంటూ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ధావన్ ఇటీవల ఓ వీడియో పోస్ట్ చేయగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 7న ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ క్రికెటర్ ఫ్యామిలీతో ఆస్ట్రేలియాతో జాలీగా ఉన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement