పుణే: ఐపీఎల్-11లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ చేశాడు. 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. జడేజా వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ ఐదో బంతికి సిక్సర్ బాది ధావన్ 50 మార్కు చేరుకున్నాడు. గాయంతో జట్టుకు దూరమైన దీపక్ చహర్ రాకతో చెన్నై బౌలింగ్ బలం పెరిగింది. సన్‌రైజర్స్ తమ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించింది. దీపక్ చహర్ వేసిన నాలుగో ఓవర్ మూడో బంతికి మరో సన్‌రైజర్స్ మరో ఓపెనర్, ఫామ్‌లో ఉన్న అలెక్స్ హేల్స్ (2) ఔటయ్యాడు. అయితే కెప్టెన్ కేన్ విలిమయ్సన్, ధావన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ కోల్పోయి 29 పరుగులే చేసింది. 10 ఓవర్లలో 62/1 గా ఉన్న సన్‌రైజర్స్ ఆపై విలియమ్సన్ (33 బంతుల్లో 40 నాటౌట్), ధావన్ (41 బంతుల్లో 64 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో స్కోరు వేగం పెరిగింది. 14 ఓవర్లో హైదరాబాద్ వికెట్ నష్టానికి 116 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment