బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో బుధవారం జరిగిన సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో చటోగ్రామ్ ఛాలెంజర్స్‌తో కొమిల్లా విక్టోరియన్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో కొమిల్లా బ్యాటర్ సునీల్ నరైన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 16 బంతుల్లో 57 పరుగులు చేసి ప్రత్యర్ధి బౌలర్లను నరైన్ ఊచకోత కోశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. కాగా సునీల్ నరైన్ కేవలం 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నరైన్ రికార్డుల కెక్కాడు. ఇక నరైన్ కన్నా ముందు ఇంగ్లండ్ బ్యాటర్ మార్కస్ ట్రెస్కోతిక్ 13 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. అయితే నరైన్.. యువరాజ్ సింగ్ రికార్డును తృటిలో కోల్పోయాడు.
కాగా 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై కేవలం 12 బంతుల్లోనే యువరాజ్ అర్ధ సెంచరీ సాధించాడు. యవీతో పాటు క్రిస్ గేల్, హజ్రతుల్లా జాజాయ్ 12 బంతుల్లోనే అర్ధ శతకాలు సాధించారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన చటోగ్రామ్ ఛాలెంజర్స్ 19.1 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. చటోగ్రామ్ బ్యాటర్లలో మెహది హసన్(44), అక్బర్ అలీ(33), పరగులుతో రాణించారు. ఇక కొమిల్లా బౌలర్లలో షాహిదుల్ ఇస్లాం, మొయిన్ అలీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఇక 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కొమిల్లా.. కేవలం 12.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కొల్పోయి టార్గెట్‌ను ఛేదించింది.
చదవండి: 13 బంతుల్లో సునామీ ఇన్నింగ్స్... బంతితోను బ్యాటర్లకు చుక్కలు.. సీఎస్‌కే ఫ్యాన్స్‌కు ఇక..!
OMGHBFUEBFIOEBV...
— FanCode (@FanCode) February 16, 2022
Brb, collecting our jaws from the floor! 🤯
📺 WATCH THE FASTEST-EVER 50 IN THE HISTORY OF #BPL ON #FANCODE 👉 https://t.co/zQb7mURAnc#BPLonFanCode #BBPL2022 @SunilPNarine74 pic.twitter.com/SJcxCojRg1
Comments
Please login to add a commentAdd a comment