రిషభ్‌.. ఆ షాట్‌ ఎన్నిసార్లు చూడాలి? | Yuvraj Singh Defends Rishabh Pant After Kevin Pietersen criticism | Sakshi
Sakshi News home page

రిషభ్‌.. ఆ షాట్‌ ఎన్నిసార్లు చూడాలి?

Published Thu, Jul 11 2019 8:44 PM | Last Updated on Thu, Jul 11 2019 9:06 PM

Yuvraj Singh Defends Rishabh Pant After Kevin Pietersen criticism - Sakshi

మాంచెస్టర్‌: న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో కీలక సమయంలో చెత్త షాట్‌ ఆడి టీమిండియా యువ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ తన వికెట్‌ను సమర్పించుకోవడంపై ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ విమర్శలు గుప్పించాడు.  ఆ చెత్త షాట్‌ను ఎన్నిసార్లు చూడాలి అంటూ విమర్శించాడు. బంతిని సరిగా అంచనా వేయకుండానే పదే పదే ఒకే తరహా షాట్‌ కొట్టి ఔట్‌ కావడాన్ని తప్పుబట్టాడు. ‘ రిషభ్‌ ఈ షాట్‌ ఎన్నిసార్లు చూడాలి. వరల్డ్‌కప్‌లో ఆడిన ప్రతీ మ్యాచ్‌లో అదే షాట్‌ కొట్టడం.. పెవిలియన్‌ చేరడం పరిపాటిగా మారిపోయింది’ అని పీటర్సన్‌ విమర్శించాడు.

కాగా, రిషభ్‌ పంత్‌ను యువరాజ్‌ సింగ్‌ వెనకేసుకొచ్చాడు. ‘రిషభ్‌ బాగా ఆడి ఉండకపోవచ్చు కానీ అతనికి 8 వన్డేలు ఆడిన అనుభవం ఉంది’ అని యువరాజ్‌ బదులిచ్చాడు. ఈ ఒక్క ఆట తీరుపై తనని విమర్శించడంలో సరికాదంటూ ట్వీట్‌ చేశాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా పిటర్సన్‌ ట్వీట్‌కు స్పందిస్తూ ..పంత్‌ క్రికెట్‌ కెరీర్‌లో ఇంకా మొదటి దశలోనే ఉన్నాడని,  తాను కూడా మొదట్లో తప్పులు చేశాను వాటిని నుంచి నేర్చుకోనే ఈ స్థాయికి వచ్చానంటూ పంత్‌కు మద్దతిచ్చాడు. ఏ పరిస్థితిలో తను ఆడలేక పోయాడో ఇప్పటికే తను తెలుసుకున్నాడని,  ఇకపై పంత్‌ మెరుగైనా ప్రదర్శన కనపరస్తాడన్ననమ్మకం ఉందంటూ కోహ్లి పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement