kevin pieterson
-
'ఆర్సీబీకి చుక్కలు చూపించాడు.. వరల్డ్‌కప్‌లో ఛాన్స్ ఇవ్వాల్సిందే'
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మూడు ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి ఒక వికెట్ తీసిన హర్‌ప్రీత్.. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కూడా అదరగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్ వంటి కీలక ఆటగాళ్లను బ్రార్ ఔట్ చేశాడు. తన బౌలింగ్‌తో ఆర్సీబీ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీకి పంజాబ్ ఆఖరి వరకు పోటీ ఇచ్చిందంటే అందుకు ప్రధాన కారణం హర్‌ప్రీత్. ఈ క్రమంలో హర్‌ప్రీత్ బ్రార్ అద్బుత ప్రదర్శన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌ను సైతం ఆకట్టుకుంది. టీ20 ప్రపంచకప్-2024 కోసం భారత సెలక్టర్లు బ్రార్‌పై కూడా ఓ కన్నేసి ఉంచాలని పీటర్సన్ అన్నాడు. "ఐపీఎల్ ఎంతో మంది దేశవాళీ ఆటగాళ్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేస్తోంది. చాలా సంతోషంగా ఉంది. నిన్నటి మ్యాచ్‌లో హర్‌ప్రీత్ బ్రార్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. టీ20 వరల్డ్‌కప్ కోసం సెలక్టర్లు అతడి పేరును పరిశీలించాలి. ఇక విరాట్ మరోసారి తన క్లాస్‌ను చూపించడంటూ" పీటర్సన్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో పంజాబ్ అనూహ్యంగా 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది -
కెవిన్ పీటర్సన్ లా మీరు మీ పాన్ కార్డ్ ను పోగొట్టుకున్నారా? తిరిగి పొందండిలా!!
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ కెవిన్ పీటర్సన్ ప్రస్తుతం స్టార్ స్పోర్ట్ బ్రాడ్ కాస్టర్ లో కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల భారత్‌లో జరిగిన ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన పాన్ కార్డ్ పోగొట్టుకున్నాడు.పాన్ కార్డ్ పోవడంతో కంగారు పడిన కెవిన్ భారత ఐటీ శాఖ అధికారులు తనకు సహాయం చేయాలని ఆయన కోరారు. కెవిన్ విజ్ఞప్తికి ఐటీ శాఖ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారు. ఇప్పుడు అదే సమస్య మనకే ఎదురైతే? ఒకవేళ పాన్ కార్డ్ పోగొట్టుకుంటే ఎలా తిరిగిపొందాలి? ఎలాంటి ప్రాసెస్ చేయాలో తెలుసుకుందాం. ►పాన్ కార్డ్ పోగొట్టుకుంటే డూప్లికేట్ పాన్ కోసం అప్లయ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా మీరు https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html ►ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మీకు ‘Changes or correction in existing PAN data/ Reprint of PAN card’. అనే ఆప్షన్ కనిపిస్తుంది. ►మీకు కావాల్సిన ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత అందులో మన వ్యక్తిగత వివరాల్ని ఎంటర్ చేసి సమ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. ►అనంతరం మీకు రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడిపై టోకెన్ నంబర్ ఐడికి టోకెన్ నెంబర్ వస్తుంది. ►తర్వాత కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. ►అందులో వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. ►ఇప్పుడు మీరు వ్యక్తిగత వివరాల డాక్యుమెంట్స్ ఫిజికల్ కాపీలను పాన్ కార్డ్ సేవల యూనిట్ ఎన్ ఎస్డీఎల్ చిరునామాకు పంపాల్సి ఉంటుంది. లేదా ఈకేవైసీ కోసం ఇ-సైన్ ఇన్ అవ్వాలి. ► అందులోదొంగతనం జరిగితే, ఎఫ్ఐఆర్ను జత చేయండి. ►ఇప్పుడు తదుపరి మెనులో కార్డును స్వీకరించే మోడ్‌ను ఎంచుకోండి. మీరు ‘ఫిజికల్ పాన్ కార్డ్ కావాలా?’ కింద ‘అవును’ ఎంచుకుంటే, కార్డ్ మీ రిజిస్టర్డ్ అడ్రస్‌కి పంపబడుతుంది. లేదంటే, రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడికి ఈ పాన్ కార్డ్‌ను సంబంధిత శాఖ అధికారులు పంపిస్తారు. ►'సంప్రదింపు వివరాలు, పత్రం వివరాలు వంటి మిగిలిన వివరాలను పూర్తి చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి. ►చెల్లింపు పేజీలో అవసరమైన చెల్లింపును చెల్లించి రసీదును పొందండి ►ఇప్పుడు, మీరు మీకు పంపిన 15-అంకెల రసీదు సంఖ్యను ఉపయోగించి మీ కార్డ్ స్థితిని తనిఖీ చేయవచ్చు. ►దరఖాస్తు చేసిన 14 రోజుల్లోగా కార్డ్ పంపబడుతుంది. -
పీటర్సన్ సునామీ ఇన్నింగ్స్.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లు.. కేవలం 38 బంతుల్లోనే
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా ఆసియా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 38 బంతుల్లో 86 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. పీటర్సన్ తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా వరల్డ్ జెయింట్స్ 150 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13 ఓవర్లలోనే చేధించింది. ఆసియా లయన్స్‌పై 7 వికెట్ల తేడాతో వరల్డ్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. వరల్డ్ జెయింట్స్ బ్యాటర్లలో పీటర్సన్(86), కెవిన్ ఓబ్రియాన్(31) పరుగులతో రాణించారు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసియా లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు సాధించింది. లయన్స్ బ్యాటర్లలో అస్గర్ ఆఫ్ఘన్(41), రొమేష్ కలువితారణ(26) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. జెయింట్స్ బౌలర్లలో సైడ్‌బాటమ్, మోర్నే మోర్కెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, బ్రిట్లీ ,ఓబ్రియాన్ ఒక్కో వికెట్ సాధించారు.ఇక 86 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన పీటర్సన్‌కి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ ఆవార్డు దక్కింది. Bhai Aaj jo Kevin Pietersen ne Sanath Jayasuriya ko maara hai. Bachpan ke saare dard dur ho gaye. 👏🏻 #LLCT20 https://t.co/cyRfWdDN53 — Abhishek (@abhishekr2502) January 26, 2022 -
టెక్నిక్ మార్చిన పృథ్వీ షా
న్యూఢిల్లీ: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా అదిరిపోయే ప్రదర్శన కనబరిచాడు. కేవలం 23 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, రెండు సికర్లు బాదాడు. పృథ్వీ షా ఇచ్చిన మెరుపు ఆరంభంతో ఢిల్లీ జట్టుకు భారీ స్కోరు చేయగలిగే అవకాశం లభించింది. ఐతే గత రెండు మ్యాచుల్లో చూసుకుంటే అతడి బ్యాటింగ్ వైఖరిలో కొంత మార్పు కనపించింది. ఈ విషయమై ఇంగ్లాడ్ క్రికెటర్ కెవిన్ పీటర్స్సెన్ కమెంట్రీ చేస్తూ ఢిల్లీ టీమ్ కోచ్ రికీ పాంటింగ్‌ను పృథ్వీ షా బ్యాటింగ్ గురించి అడిగాడు. అతడు మంచి టెక్నిక్ ఉన్న బ్యాట్స్‌మెన్ అని.. ఫాస్ట్, స్పిన్ బౌలింగ్‌లో అద్భుతంగా ఆడుతున్నాడని పాంటింగ్ మెచ్చుకున్నాడు. గత రెండేళ్లుగా పృథ్వీ తన బ్యాటింగ్ స్కిల్స్‌ను అనలైస్ చేసుకున్నాడని, ఎక్కువగా ఆఫ్ సైడ్ షాట్లు ఆడుతున్నాడని పాంటింగ్ అన్నాడు. 'ఒక కోచ్‌గా నేను అతడితో కొన్నిసార్లు మాట్లాడాను. అతడి బ్యాటింగ్ టెక్నిక్‌లో కొన్ని మార్పులు చేసుకున్నాడు. అలాంటి ప్లేయర్‌కు ఎక్కువగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇలాంటి ఫార్మాట్లో వారి ఆటను ఆడనివ్వాలి. పృథ్వీ మంచి టచ్‌లో ఉన్నాడు. ఐపీఎల్లో ఒక మంచి టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మా జట్టులో ఉన్నందుకు సంతోషిస్తున్నట్లు' పాంటింగ్ పేర్కొన్నారు. -
'పీటర్సన్.. రిటైర్మెంట్ తర్వాత వస్తా'
-
అది నన్ను అత్యంత బాధపెట్టిన క్షణం: రోహిత్
ముంబై: ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) జరుగుతుందనే ఆశాభావంలో ఉన్నాడు టీమిండియా ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ. కరోనా వైరస్ నేపథ్యంలో ఐపీఎల్-13వ సీజన్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈనెల 29వ తేదీ నుంచి ఐపీఎల్ ఆరంభం కావాల్సి ఉండగా, ఏప్రిల్ 15వరకూ ఆ లీగ్‌ను వాయిదా వేశారు. అప్పుడైనా జరుగుతుందని గ్యారంటీ లేదు. కాగా, రోహిత్ శర్మ మాత్రం పరిస్థితులు కుదట పడిన వెంటనే ఐపీఎల్ జరుగుతుందని పేర్కొన్నాడు. . ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌తో రోహిత్‌శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఐపీఎల్ నిర్వహణపై ఉన్న అవకాశాల గురించి పీటర్సన్ ప్రశ్నించాడు. దీనికి రోహిత్ సమాధానం ఇస్తూ.. ఈ విషయంలో ఆశాభావంతోనే ఉన్నామని, పరిస్థితులు సద్దుమణిగి ఓ కొలిక్కి వచ్చిన వెంటనే ఐపీఎల్ జరుగుతుందన్నాడు. ఈ సీజన్ ఐపీఎల్ ఏదొక దశలో జరగడం ఖాయమన్నాడు. అది అత్యంత బాధపెట్టిన క్షణం ముంబై ఇండియన్స్ సారథిగా పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ.. ఆ జట్టును విజయవంతంగా నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. రికీ పాంటింగ్ తర్వాత ముంబై జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ రికార్డు టైటిల్స్‌ను సాధించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. కాగా, తన కెరీర్లో అత్యంత బాధపడ్డ క్షణం కూడా ఉందని రోహిత్ పేర్కొన్నాడు. ‘ నీ క్రికెట్ కెరీర్లో లోయస్ట్ పాయింట్ ఏమైనా ఉందా’ అని పీటర్సన్ అడిగిన ప్రశ్నకు రోహిత్ ఉందనే చెప్పాడు. 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉండకపోవడం తనను అత్యంత బాధపెట్టిన క్షణమన్నాడు. ప్రధానంగా ఫైనల్ మ్యాచ్ తన సొంత గ్రౌండ్ ముంబైలో జరిగిన క్షణంలో ఇంకా బాధపడ్డానన్నాడు. అప్పటి వన్డే వరల్డ్‌కప్ ఆడిన టీమిండియా జట్టులో చోటు దక్కించుకోలేకపోవడానికి తాను చేసిన తప్పిదాలు కూడా ఒక కారణమన్నాడు. ఆ సమయంలో తన ప్రదర్శన బాలేని కారణంగానే జట్టులో ఎంపిక కాలేదన్నాడు. -
కోహ్లి.. మీ జట్టులోకి తీసుకుంటావా?: పీటర్సన్
న్యూఢిల్లీ: గత నెలలో ఒక బుడతడు క్రికెట్ ఆడుతున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇంకా డైపర్స్‌లోనే ఆ బుడ్డోడు సహజ సిద్ధమైన క్రికెట్ షాట్లతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. క్లబ్ క్రికెటర్లను మించిపోయి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లనే మైమరిపిస్తున్నాడు. కచ్చితమైన షాట్లతో చక్కని టైమింగ్‌తో బంతిని అంచనా వేస్తూ షాట్లు కొట్టేస్తున్నాడు.దిగ్గజ క్రికెటర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సైతం ముగ్థుడైపోయాడు. మొత్తం బ్యాటింగ్‌ను ఒడిసి పట్టేసుకున్నాడా అంటూ కొనియాడాడు.ఈ బుడతడు బహుశా ఇంగ్లండ్ గడ్డపైనే పుట్టి ఉంటాడంటూ కితాబు కూడా ఇచ్చేశాడు.(ఇక్కడ చదవండి: డైపర్స్ బుడతడు.. క్రికెటర్లను మించి ఆడేస్తున్నాడు!) ఇది ఇప్పుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి చేరింది. ఈ చిన్నోడి వీడియోను షేర్ చేసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్.. కోహ్లి ముందు ఒక ప్రశ్న ఉంచాడు. ‘ వాటే బ్యాటింగ్.. ఈ పిల్లోడ్ని మీ జట్టులోకి తీసుకుంటావా. మీ స్వ్కాడ్‌లో ఎంపిక చేయగలవా’ అంటూ కోహ్లిని అడిగాడు. ఆ బుడతడి బ్యాటింగ్‌కు ఫిదా అయిన కోహ్లి.. ‘ ఇది నమ్మ శక్యంగా లేదు. ఇంతకీ ఆ చిన్నోడు ఎక్కడి వాడు’ అంటూ కోహ్లి ఆసక్తిని ప్రదర్శించాడు.దీనిపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వస్ కల్లిస్ కూడా స్పందిస్తూ.. ‘ అతనిలో చాలా టాలెంట్ ఉంది. డైపర్స్ వేసుకునే వయసులోనే ఇలా ఆడేస్తున్నాడేమిటి’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. View this post on Instagram WHAT?!?!?!?!?! Get him in your squad, @virat.kohli! Can you pick him?!?! 😱 A post shared by Kevin Pietersen (@kp24) on Dec 13, 2019 at 1:07am PST -
రిషభ్.. ఆ షాట్ ఎన్నిసార్లు చూడాలి?
మాంచెస్టర్: న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో కీలక సమయంలో చెత్త షాట్ ఆడి టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ తన వికెట్‌ను సమర్పించుకోవడంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ విమర్శలు గుప్పించాడు. ఆ చెత్త షాట్‌ను ఎన్నిసార్లు చూడాలి అంటూ విమర్శించాడు. బంతిని సరిగా అంచనా వేయకుండానే పదే పదే ఒకే తరహా షాట్ కొట్టి ఔట్ కావడాన్ని తప్పుబట్టాడు. ‘ రిషభ్ ఈ షాట్ ఎన్నిసార్లు చూడాలి. వరల్డ్‌కప్‌లో ఆడిన ప్రతీ మ్యాచ్‌లో అదే షాట్ కొట్టడం.. పెవిలియన్ చేరడం పరిపాటిగా మారిపోయింది’ అని పీటర్సన్ విమర్శించాడు. కాగా, రిషభ్ పంత్‌ను యువరాజ్ సింగ్ వెనకేసుకొచ్చాడు. ‘రిషభ్ బాగా ఆడి ఉండకపోవచ్చు కానీ అతనికి 8 వన్డేలు ఆడిన అనుభవం ఉంది’ అని యువరాజ్ బదులిచ్చాడు. ఈ ఒక్క ఆట తీరుపై తనని విమర్శించడంలో సరికాదంటూ ట్వీట్ చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పిటర్సన్ ట్వీట్‌కు స్పందిస్తూ ..పంత్ క్రికెట్ కెరీర్లో ఇంకా మొదటి దశలోనే ఉన్నాడని, తాను కూడా మొదట్లో తప్పులు చేశాను వాటిని నుంచి నేర్చుకోనే ఈ స్థాయికి వచ్చానంటూ పంత్‌కు మద్దతిచ్చాడు. ఏ పరిస్థితిలో తను ఆడలేక పోయాడో ఇప్పటికే తను తెలుసుకున్నాడని, ఇకపై పంత్ మెరుగైనా ప్రదర్శన కనపరస్తాడన్ననమ్మకం ఉందంటూ కోహ్లి పేర్కొన్నాడు. -
వాళ్లకు తెలియకుండానే జరిగిందా?
సాక్షి, స్పోర్ట్స్ : గత రెండు రోజులుగా క్రికెట్ అభిమానులను కలవరపాటుకు గురిచేస్తున్న బాల్ ట్యాంపరింగ్ వివాదంపై పలువురు క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ‘వ్యక్తిని బట్టి, ప్రాతినిథ్య జట్టును బట్టి శిక్షలు ఖారారు చేయడం ఐసీసీ తీరును తెలియజేస్తుంది.. వారెవ్వా ఐసీసీ’ అంటూ హర్భజన్ మండిపడిన విషయం తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, దిగ్గజ ఆటగాడు కెవిన్ పీటర్సన్ కూడా ఈ వివాదంపై స్పందించాడు. ‘కోచ్‌తో సహా ఆటగాళ్లంతా కలిసి క్రికెట్‌ను ఎంతగానో ప్రేమించే ఆస్ట్రేలియాను, టెస్ట్ క్రికెట్‌ను అవమానపరిచారు. మీరు చేసిన ఈ పని ఏమాత్రం సరైంది కాదు. జట్టు కోచ్ లీమన్, బౌలింగ్ కోచ్ డేవిడ్ సాకర్‌కు తెలియకుండానే ఇదంతా జరిగిందా? వీరిద్దరిపై కూడా చర్యలు తీసుకోవాల’ని పీటర్సన్ ట్వీట్ చేశాడు. కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్‌లకు క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే ఉద్వాసన పలికింది. కాగా ఈ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్ ఆస్ట్రేలియా అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. పరువు తీసేలా ప్రవర్తించకండి: ఏఎస్సీ ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కమిషన్ అధికారి జాన్ వీలీ, బోర్డు సీఈఓ కేట్ పామర్ మాట్లాడుతూ.. ఏ ఆటలోనైనా మోసానికి పాల్పడితే ఒప్పుకోబోమని, బాల్ ట్యాంపరింగ్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కెప్టెన్ స్టీవ్ స్మిత్, కోచ్, సహాయ సిబ్బందితో పాటు, జట్టులోని ఇతర సభ్యులెవరైనా సీఏ ముందు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ అంశంలో ఎవరెవరు భాగమై ఉన్నారనేది తెలుకోవాల్సి ఉందని ఏఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆస్ట్రేలియా అథ్లెట్లు, ఇతర జట్లు అన్నీ నిజాయితీగా వ్యవహరించాలని.. క్రీడాస్ఫూర్తి కలిగి ఉండాలని కోరింది. Anyone heard from Lehmann? Saker? That’s Head Coach & Bowling Coach. Pretty instrumental in all of this... — Kevin Pietersen (@KP24) March 25, 2018 Slept on it...Lehmann, Saker & the leaderships groups jobs are untenable! They’ve disgraced a great cricketing nation & Test cricket! — Kevin Pietersen (@KP24) March 25, 2018 -
పీటర్సన్ కు తీరిన వీసా సమస్య
గత పది రోజులుగా నలుగుతున్న తన వీసా సమస్యను ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ట్విట్టర్ ద్వారా ఒక్క రోజులోనే పరిష్కరించుకున్నాడు. విషయంలోకి వెళితే... ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ డేర్‌డెవిల్స్ కొత్త జెర్సీ ఆవిష్కరణ కోసం ఈనెల చివరిలో కేపీ భారత్‌కు రావాల్సి ఉంది. వీసా మంజూరు కోసం ఇంగ్లండ్‌లో ఉన్న భారత హైకమిషనర్ కార్యాలయంలో తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాడు. అయితే పది రోజులైనా అక్కడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో విసిగిపోయిన కేపీ తన ఆవేదనను ట్విట్టర్లో పంచుకున్నాడు. ‘అర్జెంట్‌గా భారత్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ భారత ఎంబసీ దగ్గర పది రోజులుగా నా పాస్‌పోర్ట్ ఉంది. దయచేసి నాకు సహాయం చేయండి’ అని దౌత్యాధికారులను కోరుతూ ట్వీట్ చేశాడు. ఈ కామెంట్స్‌కు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పందిస్తూ క్రీడా శాఖ నుంచి ఆ ఈవెంట్‌కు అనుమతి పొందాల్సి ఉందని కేపీకి ట్వీట్ చేశారు. ఆ తర్వాత క్రీడా శాఖ తప్పనిసరి అనుమతి ఇచ్చినట్టు ఆయన మరో ట్వీట్ చేశారు. దీనికి ఎగిరి గంతేసిన పీటర్సన్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ‘శుభవార్త. ట్విప్లోమసీ (ట్వీట్+డిప్లొమసీ) బాగానే పనిచేసింది. క్రీడా శాఖ నుంచి తప్పనిసరి అనుమతి లభించింది. వీసా త్వరలోనే మంజూరవుతుంది. భారత్‌లో కలుద్దాం’ అని అన్నాడు.