పీటర్సన్ సునామీ ఇన్నింగ్స్‌.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లు.. కేవ‌లం 38 బంతుల్లోనే | Kevin Pietersen wreaks havoc with the bat, World Giants Super Victory | Sakshi
Sakshi News home page

పీటర్సన్ సునామీ ఇన్నింగ్స్‌.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లు.. కేవ‌లం 38 బంతుల్లోనే

Published Thu, Jan 27 2022 11:00 AM | Last Updated on Thu, Jan 27 2022 1:41 PM

Kevin Pietersen wreaks havoc with the bat, World Giants Super Victory - Sakshi

లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో భాగంగా ఆసియా లయన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్ బ్యాట‌ర్ కెవిన్ పీటర్సన్ విధ్వంసం సృష్టించాడు.  కేవలం 38 బంతుల్లో 86 పరుగులు చేశాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. పీట‌ర్సన్ తుపాన్ ఇన్నింగ్స్ ఫ‌లితంగా వరల్డ్ జెయింట్స్ 150 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేవ‌లం 13 ఓవ‌ర్ల‌లోనే చేధించింది. ఆసియా లయన్స్‌పై 7 వికెట్ల తేడాతో వరల్డ్ జెయింట్స్  ఘ‌న విజ‌యం సాధించింది.

వరల్డ్ జెయింట్స్ బ్యాట‌ర్ల‌లో పీటర్సన్(86), కెవిన్ ఓబ్రియాన్(31) ప‌రుగుల‌తో రాణించారు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసియా లయన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 149 ప‌రుగులు సాధించింది. లయన్స్ బ్యాట‌ర్ల‌లో అస్గర్ ఆఫ్ఘన్‌(41), రొమేష్ కలువితారణ(26) ప‌రుగుల‌తో టాప్ స్కోరర్‌లుగా నిలిచారు. జెయింట్స్ బౌల‌ర్ల‌లో సైడ్‌బాటమ్, మోర్నే మోర్కెల్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, బ్రిట్‌లీ ,ఓబ్రియాన్ ఒక్కో వికెట్ సాధించారు.ఇక 86 ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్ ఆడిన పీటర్సన్‌కి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ ఆవార్డు ద‌క్కింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement