If You Lost Your Pan Card You Know What to Do - Sakshi
Sakshi News home page

కెవిన్ పీటర్సన్ లా మీరు మీ పాన్ కార్డ్ ను పోగొట్టుకున్నారా? తిరిగి పొందండిలా!!

Published Wed, Feb 16 2022 4:23 PM | Last Updated on Wed, Feb 16 2022 5:42 PM

 If You Lose Your Pan Card You Know What To Do - Sakshi

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ కెవిన్ పీటర్సన్ ప్ర‌స్తుతం స్టార్ స్పోర్ట్ బ్రాడ్ కాస్టర్ లో కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవ‌ల భార‌త్‌లో జ‌రిగిన ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న పాన్ కార్డ్ పోగొట్టుకున్నాడు.పాన్ కార్డ్ పోవ‌డంతో కంగారు ప‌డిన కెవిన్  భారత ఐటీ శాఖ అధికారులు తనకు సహాయం చేయాలని ఆయన కోరారు. కెవిన్ విజ్ఞ‌ప్తికి ఐటీ శాఖ అధికారులు స్పందించి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారు. 

ఇప్పుడు అదే స‌మ‌స్య మ‌నకే ఎదురైతే? ఒకవేళ పాన్ కార్డ్ పోగొట్టుకుంటే ఎలా తిరిగిపొందాలి? ఎలాంటి ప్రాసెస్ చేయాలో తెలుసుకుందాం.

పాన్ కార్డ్ పోగొట్టుకుంటే డూప్లికేట్ పాన్ కోసం అప్ల‌య్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా మీరు  https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html

ఓపెన్ చేసిన త‌ర్వాత ఇందులో మీకు  ‘Changes or correction in existing PAN data/ Reprint of PAN card’. అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది.  

మీకు కావాల్సిన ఆప్ష‌న్ పై క్లిక్ చేసిన త‌ర్వాత అందులో మ‌న వ్య‌క్తిగ‌త వివ‌రాల్ని ఎంట‌ర్ చేసి స‌మ్మిట్ బ‌ట‌న్ క్లిక్ చేయాలి.  

అనంత‌రం మీకు రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడిపై టోకెన్ నంబర్ ఐడికి టోకెన్ నెంబ‌ర్ వ‌స్తుంది.     
 
త‌ర్వాత కంటిన్యూ విత్ పాన్ అప్లికేష‌న్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. 

అందులో వ్యక్తిగత వివరాలు న‌మోదు చేయాలి.   

ఇప్పుడు మీరు వ్య‌క్తిగ‌త వివ‌రాల డాక్యుమెంట్స్ ఫిజిక‌ల్ కాపీల‌ను పాన్ కార్డ్ సేవ‌ల యూనిట్ ఎన్ ఎస్‌డీఎల్ చిరునామాకు పంపాల్సి ఉంటుంది. లేదా ఈకేవైసీ కోసం ఇ-సైన్ ఇన్ అవ్వాలి. 
 
► అందులోదొంగతనం జరిగితే, ఎఫ్‌ఐఆర్‌ను జత చేయండి.

ఇప్పుడు తదుపరి మెనులో కార్డును స్వీకరించే మోడ్‌ను ఎంచుకోండి. మీరు ‘ఫిజికల్ పాన్ కార్డ్ కావాలా?’ కింద ‘అవును’ ఎంచుకుంటే, కార్డ్ మీ రిజిస్టర్డ్ అడ్రస్‌కి పంపబడుతుంది. లేదంటే, రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడికి ఈ పాన్ కార్డ్‌ను సంబంధిత శాఖ అధికారులు పంపిస్తారు.

'సంప్రదింపు వివరాలు, పత్రం వివరాలు వంటి మిగిలిన వివరాలను పూర్తి చేసి స‌బ్మిట్ బ‌ట‌న్‌పై  క్లిక్ చేయండి.

చెల్లింపు పేజీలో అవసరమైన చెల్లింపును చెల్లించి ర‌సీదును పొందండి  

ఇప్పుడు, మీరు మీకు పంపిన 15-అంకెల రసీదు సంఖ్యను ఉపయోగించి మీ కార్డ్ స్థితిని తనిఖీ చేయవచ్చు.

దరఖాస్తు చేసిన 14 రోజుల్లోగా కార్డ్ పంపబడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement