Pancard
-
అలర్ట్.. రెండు రోజుల్లో ముగియనున్న గడువు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొన్ని ఆర్థికపరమైన పనులకు అదే చివరి తేదీగా ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి చాలా సంస్థల నిబంధనల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. మార్చి 31తో గడువు ముగియనున్న కొన్నింటి వివరాలు ఈ కింది కథనంలో తెలుసుకుందాం. పెట్టుబడిదారులు దీర్ఘకాలిక లాభాలకోసం మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేస్తూంటారు. అధికారిక ధ్రువీకరణలతో కేవైసీ నిబంధనలను పూర్తి చేయని వారు మార్చి 31లోపు రీకేవైసీని పూర్తి చేయాలి. బ్యాంకుల్లోనూ ఆధార్, పాన్ కార్డులాంటివి లేకపోతే గడువులోపు కేవైసీని అప్డేట్ చేయాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అందిస్తున్న అమృత్ కలశ్ ప్రత్యేక డిపాజిట్ వ్యవధి మార్చి 31తో ముగియనుంది. దీని వ్యవధి 400 రోజులు. వడ్డీ రేటు 7.10 శాతం. సీనియర్లకు 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో టార్గెట్ రీచ్ అవ్వడానికి కొన్ని బ్యాంకులు హోంలోన్లపై మార్చి 31 వరకు రాయితీలు ఇస్తున్నాయి. ఆదాయపు పన్ను రిటర్నులకు సంబంధించి, అప్డేటెడ్ రిటర్నులు దాఖలు చేయడానికి గడువు ముగుస్తుంది. ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు వచ్చిన వారు ఈ పనిని పూర్తి చేయాలి. 2021-22, 2022-23, 2023-24 మదింపు సంవత్సరాలకు సంబంధించి వీటిని దాఖలు చేసేందుకు ఆదాయపు పన్ను విభాగం అనుమతినిచ్చింది. ఇదీ చదవండి: అంబానీ-అదానీ దోస్త్ మేరా దోస్త్..! -
మారనున్న నిబంధనలు!, పాన్ కార్డు అమలులో కేంద్రం మరో కీలక నిర్ణయం?
వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇన్వెస్టర్లు, వ్యాపారాలకు అనుమతుల కోసం జాతీయ స్థాయిలో సింగిల్ విండో (nsws) విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వ్యాపారాల అనుమతుల విషయంలో ఈ ఎన్ఎస్డ్ల్యూఎస్ విధానాన్ని అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. దేశంలో బిజినెస్ ప్రారంభించాలనుకునేవారు కొన్ని సార్లు కేంద్ర, రాష్ట్ర శాఖల నుంచి వేర్వేరు ఆమోదాలు, అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ,జీఎస్టీఎన్,టీఐఎన్,టీఏఎన్, పాన్ వంటి 13 విభిన్న ఐడీల్ని ఉపయోగించాల్సి ఉంది. అయితే పైన పేర్కొన్న ఐడీ కార్డలను ఉపయోగించి అప్రూవల్ పొందాలంటే నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ తరుణంలో ఆ సమస్యను అధిగమించేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఒక్క పాన్ కార్డుతో అనుమతులు ఇచ్చేలా నేషనల్ సింగిల్ విండో సిస్టం పద్దతిని అమలు చేస్తే ఎలా ఉంటుందో’నని కేంద్రం పరిశీలిస్తోంది. ఈ విషయంపై తమ మంత్రిత్వ శాఖ ఇప్పటికే రెవెన్యూ శాఖను సంప్రదించిందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ‘మేము ఇప్పటికే ఉన్న డేటాబేస్‌లలో పాన్ నెంబర్‌ను ఎంట్రీ పాయింట్‌గా ఉపయోగించుకునే దిశగా ముందుకు సాగుతున్నాము. కాబట్టి పాన్‌తో, కంపెనీకి సంబంధించిన ప్రాథమిక డేటా, దాని డైరెక్టర్లు, చిరునామాలు, సాధారణ డేటా ఇప్పటికే పాన్ డేటాబేస్‌లో అందుబాటులో ఉన్నాయి’ అని గోయల్ అన్నారు. ప్రస్తుతం పాన్ కార్డును వినియోగించి వ్యాపారా అనుమతులు ఇచ్చేలా సింగిల్ విండో పాలసీని కొన్ని రాష్ట్రాల్లో ట్రయల్స్ నిర్వహిస్తున్నాం. ఫలితాల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. చదవండి👉 మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా..? మారిన ఏటీఎం విత్‌డ్రా నిబంధనలు -
మీకు తెలియకుండా.. మీ పేరు మీద ఇంకెవరైనా లోన్ తీసుకున్నారా!
మీకు తెలియకుండా లేకుండా.. మీ పేరు మీదు ఇంకెవరైనా పర్సనల్ లోన్, కన్జ్యూమర్ లోన్ తీసుకుంటున్నారా? ఎస్. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా.. అక్షరాల ఇది నిజం. ఇటీవల కాలంలో అకౌంట్ హోల్డర్లకు తెలియకుండా పాన్ కార్డ్‌ల సాయంతో వారి పేరు మీద వేరే వాళ్లు బ్యాంకులు లేదంటే ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్లు తీసుకుంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇలా సీక్రెట్‌గా తీసుకునే లోన్ల కారణంగా నేరస్తుల రుణాల్ని బాధితులు చెల్లించడమో,లేని పక్షంలో కోర్ట్‌ను ఆశ్రయించడం లాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటి వల్ల ఆర్ధిక ఇబ్బందులతో పాటు డబ్బులు కట్టకుండా ఎగ్గొడుతున్నారనే అపవాదు మోయాల్సి ఉంటుంది. రహస్యంగా లోన్ మరి ఎలాంటి సందర్భాల్లో మీకు తెలియకుండా మీ పేరుమీద రహస్యంగా లోన్లను తీసుకోవచ్చంటే? బహిరంగంగా లేదంటే,సీక్రెట్‌గా బ్యాంక్‌ల నుంచి, ఆర్ధిక సంస్థల నుంచి ఈజీగా లోన్లు తీసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.ఎలా అంటే? ఉదాహరణకు మనం తీసుకునే లోన్లకు పాన్ నెంబర్ లింకై ఉంటుంది. ఆ పాన్ నెంబర్‌తోనే ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా లోన్లను పొందవచ్చు. నేరస్తులు చట్టబద్దంగానే అస్సలు మీతో సంబంధం లేకుండా బ్యాంక్ నుంచి వారికి కావాల్సిన రుణాల్ని పొందే అవకాశం ఉంటుంది. అలాంటి లోన్లకు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరి అలాంటి సమస్యలు రాకుండా ఏం చేయాలంటే. క్రెడిట్ స్కోర్ చెక్ చేయండి బ్యాంక్‌ల నుంచి లోన్ తీసుకుంటే తప్పని సరిగా సంబంధిత డాక్యుమెంట్లకు పాన్ నెంబర్‌ను జత చేస్తారు. మీ పాన్ నెంబర్ సాయంతో సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటే..మీరు ఎప్పుడు? ఎక్కడ? లోన్ తీసుకున్నారు. ఎంత చెల్లించారు. ఇంకా ఎంత చెల్లించాలి అనే విషయాలన్నీ బయటకొస్తాయి. మీరు కాకుండా ఇంకెవరైనా మీ పేరు మీద లోన్ తీసుకుంటే అలాంటి మోసాల్ని ఈజీగా గుర్తించొచ్చు. అదే జరిగితే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. జరిగిన మోసంపై ఫిర్యాదు చేయాలంటే! ఇటీవల ఓ బాధితుడు (పేరు చెప్పేందుకు ఇష్టపడలేదు) తనకు తెలియకుండా తనపేరు మీద లోన్ తీసుకున్నట్లు గుర్తించాడు. ఆ సమయంలో తన క్రెడిట్ స్కోర్ 776 నుంచి 830కి పెరిగింది. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్యాంక్ లోన్‌కు పాన్ నెంబర్‌ను డీయాక్టీవ్ చేసినట్లు తెలిపాడు. వెంటనే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయగా.. తనకు జరిగిన మోసంపై బ్యాంకు అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బ్యాంకులు మిమ్మల్ని నమ్మవ్! కొన్ని సందర్భాల్లో బ్యాంకులు మీ ఫిర్యాదును నమ్మే సాహసం చేయవు. అలాంటప్పుడు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. అక్కడ న్యాయం జరగలేదంటే కోర్ట్లు లేదా స్థానిక సైబర్ నేరాల విభాగానికి ఫిర్యాదు చేయోచ్చు. క్రెడిట్ బ్యూరోల దృష్టికి తీసుకెళ్లాలి. వాళ్లు చెక్ చేసి మీ సిబిల్ స్కోర్ తగ్గింపు,పెంచే విషయంలో సత్వర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, సిబిల్ స్కోర్ల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు. చదవండి👉 ధరలు పెరిగితే ధనవంతులకే నష్టం - కేంద్ర ఆర్థిక శాఖ -
కెవిన్ పీటర్సన్ లా మీరు మీ పాన్ కార్డ్ ను పోగొట్టుకున్నారా? తిరిగి పొందండిలా!!
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ కెవిన్ పీటర్సన్ ప్రస్తుతం స్టార్ స్పోర్ట్ బ్రాడ్ కాస్టర్ లో కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల భారత్‌లో జరిగిన ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన పాన్ కార్డ్ పోగొట్టుకున్నాడు.పాన్ కార్డ్ పోవడంతో కంగారు పడిన కెవిన్ భారత ఐటీ శాఖ అధికారులు తనకు సహాయం చేయాలని ఆయన కోరారు. కెవిన్ విజ్ఞప్తికి ఐటీ శాఖ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారు. ఇప్పుడు అదే సమస్య మనకే ఎదురైతే? ఒకవేళ పాన్ కార్డ్ పోగొట్టుకుంటే ఎలా తిరిగిపొందాలి? ఎలాంటి ప్రాసెస్ చేయాలో తెలుసుకుందాం. ►పాన్ కార్డ్ పోగొట్టుకుంటే డూప్లికేట్ పాన్ కోసం అప్లయ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా మీరు https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html ►ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మీకు ‘Changes or correction in existing PAN data/ Reprint of PAN card’. అనే ఆప్షన్ కనిపిస్తుంది. ►మీకు కావాల్సిన ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత అందులో మన వ్యక్తిగత వివరాల్ని ఎంటర్ చేసి సమ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. ►అనంతరం మీకు రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడిపై టోకెన్ నంబర్ ఐడికి టోకెన్ నెంబర్ వస్తుంది. ►తర్వాత కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. ►అందులో వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. ►ఇప్పుడు మీరు వ్యక్తిగత వివరాల డాక్యుమెంట్స్ ఫిజికల్ కాపీలను పాన్ కార్డ్ సేవల యూనిట్ ఎన్ ఎస్డీఎల్ చిరునామాకు పంపాల్సి ఉంటుంది. లేదా ఈకేవైసీ కోసం ఇ-సైన్ ఇన్ అవ్వాలి. ► అందులోదొంగతనం జరిగితే, ఎఫ్ఐఆర్ను జత చేయండి. ►ఇప్పుడు తదుపరి మెనులో కార్డును స్వీకరించే మోడ్‌ను ఎంచుకోండి. మీరు ‘ఫిజికల్ పాన్ కార్డ్ కావాలా?’ కింద ‘అవును’ ఎంచుకుంటే, కార్డ్ మీ రిజిస్టర్డ్ అడ్రస్‌కి పంపబడుతుంది. లేదంటే, రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడికి ఈ పాన్ కార్డ్‌ను సంబంధిత శాఖ అధికారులు పంపిస్తారు. ►'సంప్రదింపు వివరాలు, పత్రం వివరాలు వంటి మిగిలిన వివరాలను పూర్తి చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి. ►చెల్లింపు పేజీలో అవసరమైన చెల్లింపును చెల్లించి రసీదును పొందండి ►ఇప్పుడు, మీరు మీకు పంపిన 15-అంకెల రసీదు సంఖ్యను ఉపయోగించి మీ కార్డ్ స్థితిని తనిఖీ చేయవచ్చు. ►దరఖాస్తు చేసిన 14 రోజుల్లోగా కార్డ్ పంపబడుతుంది. -
ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్!
ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్. మార్చి 31లోపు ఎస్బీఐ ఖాతా దారులు ఆధార్ కార్డ్‌తో పాన్ కార్డ్ లింక్ చేయాలని ఎస్బీఐ తెలిపింది. గడువు తేదీ లోగా జత చేయకపోతే బ్యాంక్ ట్రాన్సాక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని సూచించింది. అందుకే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ వినియోగదారులు తప్పనిసరిగా ఆధార్- పాన్ లింక్‌ను జతచేయాలని విజ్ఞప్తి చేసింది. నేషనల్ మీడియా కథనాల ప్రకారం.. ఎస్బీఐ ఓ ట్వీట్లో అసౌకర్యం లేకుండా బ్యాంకింగ్ సేవల్ని కొనసాగించేలా మా కస్టమర్లు వారి ఆధార్ కార్డ్‌కు పాన్‌కార్డ్‌ను జత చేయాలని సూచిస్తున్నాము.నిర్ధిష్ట గడువు లోగా లింక్ చేయకపోతే ఎస్బీఐ ట్రాన్సాక్షన్లపై ప్రభావం చూపుతుందని ఎస్బీఐ అధికారంగా తెలిపినట్లు కథనాలు పేర్కొన్నాయి. కాగా కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆధార్‌కు పాన్ లింక్ చేసే గడువు తేదీని ఎస్బీఐ సెప్టెంబర్ 30 2021 నుండి 31 మార్చి 2022 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. -
ఇక వారి ఖాతాలో మాత్రమే జీఎస్టీ రిఫండ్ జమ
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులను జీఎస్టీ రిఫండ్లను క్లెయిమ్ చేసుకునేందుకు ఆధార్ ధ్రువీకరణను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నెల సెప్టెంబరు 17న లక్నోలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశంలో జీఎస్టీ రీఫండ్ క్లెయిం చేసుకోవడానికి ఆధార్ ప్రమాణీకరణను తప్పనిసరి చేయాలని సభ్యులు నిర్ణయించారు. అందులో భాగంగానే కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్(సీబీఐసీ) సెప్టెంబర్ 26న జీఎస్టీ నిబంధనలను సవరించినట్లు ప్రకటించింది. వివిధ పన్ను ఎగవేత వ్యతిరేక చర్యలను అరికట్టడానికి ఈ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) రిజిస్ట్రేషన్ పొందిన అదే పాన్ కార్డుతో లింక్ చేసిన బ్యాంకు ఖాతాలో మాత్రమే జీఎస్టీ రిఫండ్లను చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే వ్యాపారులు జీఎస్టీ వివరాలు సమర్పించే జీఎస్టీఆర్-3బీ రిటర్న్ దాఖలు చేయడాన్ని ఒక్క నెల ఆపేసినా.. ఆ తదుపరి నెలకు జీఎస్టీఆర్-1 విక్రయాల రిటర్న్‌ను దాఖలు చేసే వీలుండదని నోటిఫికేషన్ లో పేర్కొంది. ఈ నియమం జనవరి 1, 2022 నుండి అమల్లోకి వస్తుంది. (చదవండి: చిన్న సిటీలకు చిట్టి విమానం, రివ్వున ఎగిరేందుకు రెడీ) -
మీ పాన్ కార్డ్ పోయిందా..! వెంటనే ఇలా చేయండి..!
e-PAN Card Download Online: పర్మినెంట్ అకౌంట్ నెంబర్(PAN) పాన్ కార్డు దేశవ్యాప్తంగా ముఖ్యమైన గుర్తింపు కార్డులలో ఒకటి. బ్యాంకుల్లో ఎక్కువ లావాదేవీలను జరిపే వారికి పాన్‌కార్డ్ అనేది తప్పనిసరి. దురదృష్టవశాత్తు మీ పాన్‌కార్డు పోతే బాధపడకండి. పాన్‌కార్డును ఆన్లైన్లో తిరిగి పొందవచ్చును. మీ పాన్ కార్డును పోగొట్టుకున్నట్లయితే, పాన్ కార్డులను జారీ చేసే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) అధికారిక వెబ్సైట్ నుంచి పాన్‌కార్డును మరల పొందవచ్చును. ఏదైనా అత్యవసర పని కోసం మీకు మీ పాన్ కార్డ్ అవసరమైతే, మీరు కేవలం ఎలక్ట్రానిక్ పాన్ కార్డ్ లేదా ఈ-పాన్ డౌన్లోడ్ చేసుకోనే సౌకర్యాన్ని ఎన్ఎస్డీఎల్ కల్పిస్తోంది. మీరు ఆన్లైన్లో ఈ-పాన్‌ను ఇలా పొందండి స్టెప్1: ఆన్లైన్లో ఈ-పాన్ కార్డును డౌన్లోడ్ చేయడానికి, మీరు యుటిఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ https://www.utiitsl.com/ అధికారిక వెబ్‌సైట్‌కు సందర్శించండి. స్టెప్ 2: అందులో 'పాన్ కార్డ్ సర్వీసెస్ ' ఆప్షన్‌ను ఎంచుకోండి. స్టెప్ 3: క్లిక్ చేశాక మీరు మరో వెబ్‌పేజీకి మళ్ళించబడతారు. అందులో 'డౌన్లోడ్ ఇ-పాన్' పై క్లిక్ చేయండి. స్టెప్ 4: తరువాత వచ్చే వెబ్‌పేజీలో మీ పాన్ కార్డ్ వివరాలను నమోదు చేయాలి. స్టెప్ 5: మీ పుట్టిన తేదీ వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయాలి. మీరు మీ GSTIN నంబర్‌ను కూడా నమోదు చేయవచ్చు. స్టెప్ 6: క్యాప్చా వివరాలను సబ్మిట్ చేసి మీ వివరాలను ధృవీకరించండి. స్టెప్ 7: ఇప్పుడు, మీరు మీ ఇమెయిల్ ఐడి మరియు రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌పై లింక్‌ను అందుకుంటారు స్టెప్ 8: ఇప్పుడు మీరు మీ ఈ మెయిల్ ఐడి, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌పై లింక్ వస్తుంది. మీ ఈ మెయిల్ ఐడి, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌ను ధృవీకరించడానికి ఓటీపీ వస్తోంది. ఓటీపీని ఎంటర్చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత మీ ఈ-పాన్ కార్డు డౌన్లోడ్ అవుతుంది. గమనిక: మీరు మీ ఈ- పాన్‌కార్డును పొందాలంటే కచ్చితంగా మీ ఫోన్ పాన్‌కార్డుతో రిజిస్టరై ఉండాలి. అధికారిక వెబ్సైట్ నుంచి మీరు నెలకు మూడుసార్లు మాత్రమే ఈ-పాన్‌ను పొందుతారు. -
మీ పాన్ కార్డును అప్డేట్ చేయండి ఇలా...!
పర్మినెంట్ అకౌంట్ నెంబర్(PAN) పాన్ కార్డు దేశవ్యాప్తంగా ముఖ్యమైన గుర్తింపు కార్డులలో ఒకటి. బ్యాంకుల్లో ఎక్కువ లావాదేవీలను జరిపే వారికి పాన్‌కార్డ్ అనేది తప్పనిసరి. పాన్‌కార్డులో ఏదైనా తప్పుడు సమాచారం ఉంటే భవిష్యత్తులో సమస్యగా మారుతుంది. వీలైనంత త్వరగా పొరపాట్లను సరిదిద్దుకోవాలి. పాన్‌కార్డులోని పొరపాట్లను ఇంట్లో ఉండి ఆన్లైన్లోనే అప్డేట్ చేయవచ్చును. మీ పాన్ కార్డును ఇలా అప్డేట్ చేయండి...! 1. మీ బ్రౌజర్లో https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html వెబ్‌సైట్‌ను ఒపెన్ చేయండి. 2. మీకు ఆన్లైన్ పాన్ అప్లికేషన్ ఫారం మీకు కనిపిస్తోంది. అందులో ‘అప్లై ఆన్లైన్’ను ఎంచుకోండి. 3.అందులో ‘అప్లికేషన్ టైప్’ను ఎంచుకోండి. అందులో ఛేంజేస్ ఆర్ కరెక్షన్ ఇన్ ఎక్జ్సిటింగ్ పాన్ డేటాను ఎంచుకోండి. కేటగీరి ఆప్షన్లో ఇన్డివిజువల్ను ఎంచుకోండి. 4. మీ వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయండి. 5. కాప్చాకోడ్ను ఫిల్ చేసి సబ్మిట్ ఆప్షన్‌పై నోక్కండి. 6. మీ సమాచారాన్ని ఫిల్ చేసి ఎంటర్ చేశాక వెబ్సైట్ నుంచి టోకెన్ నంబర్ ఈ-మెయిల్‌కు వస్తుంది. అందులో కంన్టిన్యూ బటన్ క్లిక్ చేయండి. 7. మీరు మరొక వెబ్ పేజీకి మళ్లించబడతారు. తరువాత ‘NSDL e-gov’లో ఈ-సైన్ ద్వారా స్కాన్ చేసిన చిత్రాలను సమర్పించండి. 8. వెబ్‌పేజీలో అడిగే అవసరమైన సమాచారాన్ని పూరించండి. తదుపరి క్లిక్ చేయండి. 9. తరువాత మీ అడ్రస్‌కు సంబంధించిన వెబ్ పేజీకి మళ్లించబడతారు. 10. మీ అడ్రస్, వయసు, గుర్తింపు ఉన్న కార్డును , పాన్ కార్డును అప్లోడ్ చేయండి. 11. డిక్లరేషన్‌పై సంతకం చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి. 12. తరువాత పేమెంట్ గేట్ వే ఆప్షన్ వెబ్ పెజీకి మళ్లించబడతారు . పేమెంట్ అయ్యాక మీకు రశీదు వస్తోంది. 13. రశీదును ప్రింట్ తీసుకొండి, మీ పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో పాటు రసీదు స్లిప్‌లో సూచించిన ప్రదేశంలో సంతకం చేయాలి. ఈ పత్రాలను NSDL e-gov కార్యాలయానికి పంపాలి. కొద్దిరోజుల తరువాత మీ అప్డేట్ అయినా సమాచారంతో మీకు పాన్ కార్డు వస్తోంది. -
పాన్ కార్డులో ఉన్న ఈ సీక్రెట్ కోడ్స్ గురించి తెలుసా?
కేంద్ర ప్రభుత్వం జూన్ 30లోగా పాన్ కార్డును ఆధార్ తో ప్రతి ఒక్కరూ లింకు చేయాలని కోరింది. అయితే, మీలో ఎవరైనా ఇప్పటి వరకు చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. అసలు పాన్ కార్డు అంటే ఏమిటి? పర్మనెంట్ అకౌంట్ నెంబర్(శాశ్వత ఖాతా సంఖ్య). పాన్ నెంబరు 10 అంకెలతో తయారు చేయబడ్డ ఆల్ఫా న్యూమరిక్ నెంబరు. ఆర్థిక లావాదేవీలు జరిపే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఈ కార్డు తీసుకోవాలి. ప్రతీ ఒక్కరికీ యూనిక్ గా పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఈ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఒకేసారి జారీ మాత్రమే అవుతుంది. ఇక ఎప్పటికీ అదే నెంబర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? పాన్ కార్డులోని రెండు అక్షరాలు మీ పేరు తెలుపుతాయని. పాన్ కార్డ్ సంఖ్య వెనుక చాలా సీక్రెట్ ఉంది. ఇవి వాస్తవానికి మీ వ్యక్తిగత సమాచారం గురించి ఒకటి లేదా రెండు విషయాలు చెప్పగలవు. మొదటి 5 అంకెలు అక్షరమాలలు, తరువాతి నాలుగు సంఖ్యలు, చివరిది మళ్ళీ అక్షరమాల. వాటి వెనుక ఉన్న సీక్రెట్ కోడ్స్ గురుంచి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి మూడు అక్షరాలు: ఈ కార్డులో ఉన్న మొదటి మూడు అక్షరాలు యాదృచ్ఛికంగా ఎంపిక చేస్తారు. అవి ఎఎఎ నుంచి జెడ్ జెడ్ జెడ్ మధ్య ఉంటాయి. ఊదా: ఎడబ్ల్యుఎస్ లేదా జెడ్ యుఐ వంటి అక్షరాల కలయిక కావచ్చు. నాల్గవ అక్షరం: ఇక ఇప్పుడు కార్డులో ఉన్న నాలుగు, ఐదు అక్షరాలు చాలా ముఖ్యమైనవి. పాన్ కార్డులో ఉన్న నాల్గవ అక్షరం మీ స్థితి గురించి తెలియజేస్తుంది. ఊదా: ALWPG5809L నాల్గవ అక్షరం "పీ" అయితే, అది ఒక వ్యక్తికి చెందినది. "A" అంటే అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్(AoP) "B" అంటే బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్ (బివోఐ) "C"అంటే కంపెనీ "F" అంటే ఫర్మ్/లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్ "G" అంటే ప్రభుత్వ ఏజెన్సీ "H"అంటే హిందూ అవిభక్త కుటుంబం(హెచ్ యుఎఫ్) "J" అంటే కృత్రిమ జురిడికల్ పర్సన్ "L" అంటే లోకల్ అథారిటీ "P" అంటే వ్యక్తిగత "T" అంటే ట్రస్ట్. ఐదవ అక్షరం: ఇక ఐదో అక్షరం పాన్ కార్డ్ హోల్టర్ ఇంటిపేరు లేదా చివరి పేరులో మొదటి అక్షరం ఉంటుంది. ఉదా: రాయల్ మహేశ్ బాబు అనుకోండి. అతని పాన్ కార్డులో XXXPM1122H అని ఉంటుంది. 6-9 అక్షరాలు: ఇక తర్వాత ఉండే నాలుగు అక్షరాలు 1001 నుంచి 9999 యాదృచ్ఛిక ఎంపిక చేస్తారు. (ఉదా. ALWPG5809L). 10వ అక్షరం: పాన్ లోని పదవ అంకె మొదటి తొమ్మిది అంకెలను పరిగణనలోకి తీసుకునే ఫార్ములాపై ఆధారపడి ఉంటుంది. ఈ చివరి డిజిట్‌ను పాన్ నెంబర్ జారీ చేసే సమయంలో కంప్యూటర్ జనరేట్ చేస్తుంది. చదవండి: బడ్జెట్ లో కిల్లర్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన శామ్సాంగ్ -
పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడం ఎలా..?
పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించేందుకు చివరి తేదీ జూన్ 30. గతంలో మార్చి 31 వరకు ఉన్న గడువును ఈ నెల చివరి వరకు కరోనా మహమ్మారి కారణంగా పొడగించింది. ఇంకో సారి ఈ గడువును పొడగించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేల ఈ గడువు లోపు లింక్ చేయకపోతే రూ.1000 ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు 2021 ఆర్థిక బిల్లులో ప్రభుత్వం కొత్త సెక్షన్ 234 హెచ్‌ను ప్రవేశపెట్టింది. ఇంతవరకు పాన్- ఆధార్ లింక్ చేయని వారు ఈ నెలాఖరు లోపు లింక్ చేయడం మంచిది. పాన్ కార్డుతో, ఆధార్‌ను ఎలా లింక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. పాన్ కార్డును ఆధార్‌తో ఎలా లింక్ చేయాలి? మొదట https://www.incometax.gov.in/iec/foportal/ వెబ్ సైట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు క్రిందికి స్క్రోల్ చేసి, పోర్టల్ హోమ్‌పేజీలోని 'లింక్ ఆధార్' ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత మరో క్రొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. మీకు కనిపించే బాక్స్ లలో పాన్, ఆధార్ నంబర్, పేరు, మొబైల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయండి. ఒప్పందం అవసరమైన పెట్టెలను గుర్తించి, లింక్ ఆధార్‌పై క్లిక్ చేయండి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఆరు-అంకెల ఓటీపీ ఎంటర్ చేస్తే లింకింగ్ ప్రాసెస్‌ను ధృవీకరించండి. చదవండి: 10 నిమిషాల యాత్ర కోసం రూ.205 కోట్లు ఖర్చు -
పాన్ - ఆధార్ లింకు గడువు కొద్ది రోజులే!
మీ దగ్గర పాన్ కార్డు ఉందా? ఇంకా మీరు పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఇంకా లింక్ చేయలేదా? అయితే, వెంటనే లింక్ చేయండి. ఒకవేళ మీరు లింక్ చేయకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా రూ.1000 జరిమానా కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సమాచారాన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు తెలియజేస్తున్నాయి. పాన్ ఆధార్ లింక్ గడువు జూన్ 30తో ముగుస్తుంది. అంటే మీరు ఈ నెలలో చివరి వరకు కచ్చితంగా రెండింటినీ అనుసంధానం చేసుకోవాలి. లేకపోతే మీ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. దీంతో మీరు పాన్ కార్డును అవసరం ఉన్న చోట ఉపయోగించలేరు. గతంలోనే మార్చి 30 వరకు ఉన్న పాన్-ఆధార్ లింక్ గడువును జూన్ 30 వరకు పొడగించింది. ఇప్పుడు మరోసారి పొడగించే అవకాశాలు కూడా తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ముందే మీరు లింక్ చేసుకోవడం మంచిది. మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే మీ పాన్ కార్డ్ పనిచేయదు. అలాగే బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో అసౌకర్యాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇంకా పెన్షన్, స్కాలర్షిప్, ఎల్పీజి సబ్సిడీ వంటి పథకాలకు ద్రవ్య ప్రయోజనాలను పొందేటప్పుడు పాన్ తప్పనిసరి. మీరు ఆధార్ - పాన్లను పలు మార్గాల్లో లింక్ చేయవచ్చు. పాన్-ఆధార్ లింక్‌ను ఆన్లైన్ (https://www.incometax.gov.in/iec/foportal/)లో చేయవచ్చు. చదవండి: పూచీకత్తు లేకుండానే రూ.5 లక్షల పర్సనల్ లోన్ -
పాన్-ఆధార్ లింకుకు ఇంకా పదిహేను రోజులే
ఇవాళ మార్చి 15.. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడానికి ఆఖరు తేది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మీ నికర ఆదాయాన్ని లెక్కించుకుని, వర్తించే పన్ను భారంలో నుంచి టీడీఎస్ తగ్గించి .. మిగతా మొత్తాన్ని జూన్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో నిర్దేశించిన వాయిదాల ప్రకారం చెల్లించాలి. ఈ చెల్లింపులకు మార్చి పదిహేనే ఆఖరు తేదీ. వెంటనే చెల్లించేయండి. లేని పక్షంలో వడ్డీ భారం పడుతుంది. ఒకవేళ మార్చి 15న కుదరకపోతే కనీసం నెలాఖరు లోగానైనా చెల్లించేయాలి. ఇక 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్న్ వేయలేకపోయిన వారు మార్చి నెలాఖరు లోపల వేయవచ్చు. 2019-20కి వేసిన రిటర్నులను సవరించుకోవడానికి కూడా మార్చి 31 ఆఖరు తేదీ. చెల్లించాల్సినవి ఉంటే.. ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్లు, మెడిక్లెయిమ్, పీఎఫ్, జీవిత బీమా, పిల్లల ట్యూషన్ ఫీజులు, మున్సిపల్ పన్నులు, విరాళాలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే లోపలే చెల్లించాలి. ఏదైనా మర్చిపోతే వెంటనే చెల్లించేయండి. అలాగే నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)లో డిపాజిట్ చేసిన వారికి అదనంగా రూ. 50,000 దాకా మినహాయింపు ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇలా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను సంబంధ అంశాలన్నింటికీ మార్చి 31 గడువు తేదీ. ఆదాయ పన్ను ప్లానింగ్ గురించి మీరు ముందుగానే ఆలోచిస్తే.. మీ కుటుంబంతో పాటు మీ ఆర్థిక కార్యకలాపాల గురించి మంచి ప్రణాళిక తయారు చేసుకోవచ్చు. తద్వారా బండి సాఫీగా ముందుకు సాగిపోతుంది. వివరాలన్నీ పోల్చి చూసుకోవాలి.. కొత్త అపార్ట్మెంట్లు కొనే వాళ్లు వాటి నిర్మాణం చివరి దశలో ఉంటే ఈ సంవత్సరంలోనే తీసుకోవడమో లేదా వచ్చే ఆర్థిక సంవత్సరంలో తీసుకోవడమో ఆలోచించుకోవచ్చు. అలాగే స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి సమయం ఉంటుంది కాబట్టి వీలైతే ఏప్రిల్‌లో చేపట్టవచ్చు. అప్పుడు ప్లానింగ్ చేసుకోవడానికి, పన్నుల భారం చెల్లించడానికి తగినంత సమయం లభిస్తుంది. వ్యాపారస్తుల విషయంలో వారి వార్షిక టర్నోవరు వివరాలను అసెసీకి సంబంధించిన ఫారం 26ఏఎస్‌లో పొందుపరుస్తున్నారు. ఇందులోని వివరాలను మీ ఆర్థిక వ్యవహారాల చిట్టాగా .. మీ ఫైనాన్షియల్ రికార్డు .. మీ జాతకంగా అనుకోవచ్చు. ఎక్కడ తేడా వచ్చిన ఆరా తీస్తారు. సరైన వివరణ ఇవ్వకపోతే ఏ అధికారులూ ఊరుకోరు. కాబట్టి ఏ తప్పులు లేకుండా అన్ని వివరాల రికార్డులు, రిటర్నులు మొదలైన వాటిని ఒకదానితో మరొకటి పోల్చి చూసుకుని, తప్పులు లేకుండా వేసుకోండి. ఇక చివరిగా రెసిడెంట్ల విషయానికొస్తే.. మీ పాన్‌కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలి. దీనికి 2021 మార్చి 31 ఆఖరు తేది. కనుక త్వరపడండి. అనుసంధానం చేయకపోతే పెనాల్టీలు వడ్డిస్తారు. అన్నీ సక్రమంగా చేసుకుంటే, చూసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం ప్రశాంతంగా గడిచిపోతుంది. చదవండి: ఈపీఎఫ్ ఖాతాదారులు హోమ్ లోన్ తీసుకోండిలా! దేశంలో ఫస్ట్ ఏసీ రైల్వే టర్మినల్ -
బ్యాంకు ఖాతాలపై ఆర్బీఐ కొరడా
పాన్ నంబర్‌తో అనుసంధానం కాని బ్యాంకు ఖాతాలపై ఆర్బీఐ కొరడా ఝళిపించింది. నవంబర్ 9 తర్వాత రూ. 2 లక్షలకు పైగా డిపాజిట్ చేసిన ఖాతాలను పాన్‌తో అనుసంధానం చేయాలని, లేదా ఫారం-60ని నింపి బ్యాంకులో సమర్పించాలని సూచించింది. అంతవరకు ఖాతాను ఆపరేట్ చేయకూడదని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. అలాగే, సమయంతో సంబంధం లేకుండా.. ఐదు లక్షల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్న ఖాతాదారులు (నవంబర్ 9కి ముందు చేసిన డిపాజిట్లు) కూడా తమ ఖాతాలతో పాన్‌ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని.. అలా లేని పక్షంలో ఫారం 60ని నింపి బ్యాంకులో సమర్పించాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. లేదంటే వీరి ఖాతాను ఆపరేట్ చేయకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. పాన్ నెంబర్ అనుసంధానం చేయకుండా ఒకే వ్యక్తికి ఎక్కువ ఖాతాలు ఉంటే.. పరిమితులకు లోబడి ఒక్కో దాంట్లో పెద్ద మొత్తంలో నగదును డిపాజిట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రతి ఖాతాకు పాన్‌ను అనుసంధానం చేయడం ద్వారా ఒక వ్యక్తి ఎన్ని అకౌంట్లలో డబ్బులు వేసుకున్నా.. అవన్నీ కూడా కలిపి ఒకేసారి లెక్కలోకి వచ్చే అవకాశం ఉంటుంది. తాజాగా పంజాబ్‌లోని జలంధర్‌లో ఒక వ్యాపారవేత్త 85 బ్యాంకు ఖాతాలను నిర్వహించిన విషయం వెలుగులోకి రావడంతో రిజర్వు బ్యాంకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.