Do You Know Interesting Information Behind 10 Digits Pan Number? - Sakshi
Sakshi News home page

పాన్ కార్డులో ఉన్న ఈ సీక్రెట్ కోడ్స్ గురించి తెలుసా?

Published Mon, Jun 21 2021 5:22 PM | Last Updated on Mon, Jun 21 2021 7:04 PM

Decoded What your PAN number reveals about you - Sakshi

కేంద్ర ప్రభుత్వం జూన్ 30లోగా పాన్ కార్డును ఆధార్ తో ప్రతి ఒక్కరూ లింకు చేయాలని కోరింది. అయితే, మీలో ఎవరైనా ఇప్పటి వరకు చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. అసలు పాన్ కార్డు అంటే ఏమిటి? పర్మనెంట్ అకౌంట్ నెంబర్(శాశ్వత ఖాతా సంఖ్య). పాన్ నెంబరు 10 అంకెలతో తయారు చేయబడ్డ ఆల్ఫా న్యూమరిక్ నెంబరు. ఆర్థిక లావాదేవీలు జరిపే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఈ కార్డు తీసుకోవాలి. ప్రతీ ఒక్కరికీ యూనిక్ గా పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఈ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఒకేసారి జారీ మాత్రమే అవుతుంది. ఇక ఎప్పటికీ అదే నెంబర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? పాన్ కార్డులోని రెండు అక్షరాలు మీ పేరు తెలుపుతాయని.

పాన్ కార్డ్ సంఖ్య వెనుక చాలా సీక్రెట్ ఉంది. ఇవి వాస్తవానికి మీ వ్యక్తిగత సమాచారం గురించి ఒకటి లేదా రెండు విషయాలు చెప్పగలవు. మొదటి 5 అంకెలు అక్షరమాలలు, తరువాతి నాలుగు సంఖ్యలు, చివరిది మళ్ళీ అక్షరమాల. వాటి వెనుక ఉన్న సీక్రెట్ కోడ్స్ గురుంచి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటి మూడు అక్షరాలు: ఈ కార్డులో ఉన్న మొదటి మూడు అక్షరాలు యాదృచ్ఛికంగా ఎంపిక చేస్తారు. అవి ఎఎఎ నుంచి జెడ్ జెడ్ జెడ్ మధ్య ఉంటాయి. ఊదా: ఎడబ్ల్యుఎస్ లేదా జెడ్ యుఐ వంటి అక్షరాల కలయిక కావచ్చు. 
నాల్గవ అక్షరం: ఇక ఇప్పుడు కార్డులో ఉన్న నాలుగు, ఐదు అక్షరాలు చాలా ముఖ్యమైనవి. పాన్ కార్డులో ఉన్న నాల్గవ అక్షరం మీ స్థితి గురించి తెలియజేస్తుంది. ఊదా: ALWPG5809L నాల్గవ అక్షరం "పీ" అయితే, అది ఒక వ్యక్తికి చెందినది.

  • "A" అంటే అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్(AoP)  
  • "B" అంటే బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్ (బివోఐ) 
  • "C"అంటే కంపెనీ 
  • "F" అంటే ఫర్మ్/లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్ 
  • "G" అంటే ప్రభుత్వ ఏజెన్సీ
  • "H"అంటే హిందూ అవిభక్త కుటుంబం(హెచ్ యుఎఫ్) 
  • "J" అంటే కృత్రిమ జురిడికల్ పర్సన్ 
  • "L" అంటే లోకల్ అథారిటీ 
  • "P" అంటే వ్యక్తిగత 
  • "T" అంటే ట్రస్ట్.

ఐదవ అక్షరం: ఇక ఐదో అక్షరం పాన్ కార్డ్ హోల్టర్ ఇంటిపేరు లేదా చివరి పేరులో మొదటి అక్షరం ఉంటుంది. ఉదా: రాయల్ మహేశ్ బాబు అనుకోండి. అతని పాన్ కార్డులో XXXPM1122H అని ఉంటుంది. 
6-9 అక్షరాలు: ఇక తర్వాత ఉండే నాలుగు అక్షరాలు 1001 నుంచి 9999 యాదృచ్ఛిక ఎంపిక చేస్తారు. (ఉదా. ALWPG5809L).
10వ అక్షరం: పాన్ లోని పదవ అంకె మొదటి తొమ్మిది అంకెలను పరిగణనలోకి తీసుకునే ఫార్ములాపై ఆధారపడి ఉంటుంది. ఈ చివరి డిజిట్‌ను పాన్ నెంబర్ జారీ చేసే సమయంలో కంప్యూటర్ జనరేట్ చేస్తుంది.

చదవండి: బడ్జెట్ లో కిల్లర్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన శామ్‌సాంగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement