మీకు తెలియకుండా లేకుండా.. మీ పేరు మీదు ఇంకెవరైనా పర‍్సనల్ లోన్, కన్జ్యూమర్ లోన్ తీసుకుంటున్నారా? ఎస్. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా.. అక్షరాల ఇది నిజం. ఇటీవల కాలంలో అకౌంట్ హోల్డర్లకు తెలియకుండా పాన్ కార్డ్‌ల సాయంతో వారి పేరు మీద వేరే వాళ్లు బ్యాంకులు లేదంటే ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్‌లు తీసుకుంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ఇలా సీక్రెట్‌గా తీసుకునే లోన్‌ల కారణంగా నేరస్తుల రుణాల్ని బాధితులు చెల్లించడమో,లేని పక్షంలో కోర్ట్‌ను ఆశ్రయించడం లాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటి వల్ల ఆర్ధిక ఇబ్బందులతో పాటు డబ్బులు కట్టకుండా ఎగ్గొడుతున్నారనే అపవాదు మోయాల్సి ఉంటుంది.
రహస్యంగా లోన్
మరి ఎలాంటి సందర్భాల్లో మీకు తెలియకుండా మీ పేరుమీద రహస్యంగా లోన్‌లను తీసుకోవచ్చంటే? బహిరంగంగా లేదంటే,సీక్రెట్‌గా బ్యాంక్‌ల నుంచి, ఆర్ధిక సంస్థల నుంచి ఈజీగా లోన్‌లు తీసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.ఎలా అంటే? ఉదాహరణకు మనం తీసుకునే లోన్‌లకు పాన్ నెంబర్ లింకై ఉంటుంది. ఆ పాన్ నెంబర్‌తోనే ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా లోన్‌లను పొందవచ్చు. నేరస్తులు చట్టబద్దంగానే అస్సలు మీతో సంబంధం లేకుండా బ్యాంక్ నుంచి వారికి కావాల్సిన రుణాల్ని పొందే అవకాశం ఉంటుంది. అలాంటి లోన్‌లకు మీరు బాధ‍్యత వహించాల్సి ఉంటుంది. మరి అలాంటి సమస్యలు రాకుండా ఏం చేయాలంటే.
క్రెడిట్ స్కోర్ చెక్ చేయండి
బ్యాంక్‌ల నుంచి లోన్ తీసుకుంటే తప్పని సరిగా సంబంధిత డాక్యుమెంట్లకు పాన్ నెంబర్‌ను జత చేస్తారు. మీ పాన్ నెంబర్ సాయంతో సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటే..మీరు ఎప్పుడు? ఎక్కడ? లోన్ తీసుకున్నారు. ఎంత చెల్లించారు. ఇంకా ఎంత చెల్లించాలి అనే విషయాలన్నీ బయటకొస్తాయి. మీరు కాకుండా ఇంకెవరైనా మీ పేరు మీద లోన్ తీసుకుంటే అలాంటి మోసాల్ని ఈజీగా గుర్తించొచ్చు. అదే జరిగితే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
జరిగిన మోసంపై ఫిర్యాదు చేయాలంటే!
ఇటీవల ఓ బాధితుడు (పేరు చెప్పేందుకు ఇష్టపడలేదు) తనకు తెలియకుండా తనపేరు మీద లోన్ తీసుకున్నట్లు గుర్తించాడు. ఆ సమయంలో తన క్రెడిట్ స్కోర్ 776 నుంచి 830కి పెరిగింది. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్యాంక్ లోన్‌కు పాన్ నెంబర్‌ను డీయాక్టీవ్ చేసినట్లు తెలిపాడు. వెంటనే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయగా.. తనకు జరిగిన మోసంపై బ్యాంకు అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బ్యాంకులు మిమ్మల్ని నమ్మవ్!
కొన్ని సందర్భాల్లో బ్యాంకులు మీ ఫిర్యాదును నమ్మే సాహసం చేయవు. అలాంటప్పుడు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. అక్కడ న్యాయం జరగలేదంటే కోర్ట్‌లు లేదా స్థానిక సైబర్ నేరాల విభాగానికి ఫిర్యాదు చేయోచ్చు. క్రెడిట్ బ్యూరోల దృష్టికి తీసుకెళ్లాలి. వాళ్లు చెక్ చేసి మీ సిబిల్ స్కోర్ తగ్గింపు,పెంచే విషయంలో సత్వర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి బ్యాంక్ ట్రాన్సాక్షన్‌లు, సిబిల్ స్కోర్‌ల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment