
ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్. మార్చి 31లోపు ఎస్‌బీఐ ఖాతా దారులు ఆధార్ కార్డ్‌తో పాన్ కార్డ్ లింక్ చేయాలని ఎస్‌బీఐ తెలిపింది. గడువు తేదీ లోగా జత చేయకపోతే బ్యాంక్ ట్రాన్సాక్షన్‌లపై ప్రభావం చూపే అవకాశం ఉందని సూచించింది. అందుకే ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ వినియోగదారులు తప్పనిసరిగా ఆధార్- పాన్ లింక్‌ను జతచేయాలని విజ్ఞప్తి చేసింది.
నేషనల్ మీడియా కథనాల ప్రకారం.. ఎస్‌బీఐ ఓ ట్వీట్‌లో అసౌకర్యం లేకుండా బ్యాంకింగ్ సేవల్ని కొనసాగించేలా మా కస్టమర్లు వారి ఆధార్ కార్డ్‌కు పాన్‌కార్డ్‌ను జత చేయాలని సూచిస్తున్నాము.నిర్ధిష్ట గడువు లోగా లింక్ చేయకపోతే ఎస్‌బీఐ ట్రాన్సాక్షన్‌లపై ప్రభావం చూపుతుందని ఎస్‌బీఐ అధికారంగా తెలిపినట్లు కథనాలు పేర్కొన్నాయి.
కాగా కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆధార్‌కు పాన్ లింక్ చేసే గడువు తేదీని ఎస్‌బీఐ సెప్టెంబర్ 30 2021 నుండి 31 మార్చి 2022 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment