న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులను జీఎస్‌టీ రిఫండ్‌లను క్లెయిమ్ చేసుకునేందుకు ఆధార్ ధ్రువీకరణను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నెల సెప్టెంబరు 17న లక్నోలో జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్ 45వ సమావేశంలో జీఎస్‌టీ రీఫండ్ క్లెయిం చేసుకోవడానికి ఆధార్ ప్రమాణీకరణను తప్పనిసరి చేయాలని సభ్యులు నిర్ణయించారు. అందులో భాగంగానే కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్(సీబీఐసీ) సెప్టెంబర్ 26న జీఎస్‌టీ నిబంధనలను సవరించినట్లు ప్రకటించింది. వివిధ పన్ను ఎగవేత వ్యతిరేక చర్యలను అరికట్టడానికి ఈ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టారు.
గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్‌టీ) రిజిస్ట్రేషన్ పొందిన అదే పాన్ కార్డుతో లింక్ చేసిన బ్యాంకు ఖాతాలో మాత్రమే జీఎస్‌టీ రిఫండ్‌లను చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే వ్యాపారులు జీఎస్‌టీ వివరాలు సమర్పించే జీఎస్‌టీఆర్-3బీ రిటర్న్ దాఖలు చేయడాన్ని ఒక్క నెల ఆపేసినా.. ఆ తదుపరి నెలకు జీఎస్‌టీఆర్-1 విక్రయాల రిటర్న్‌ను దాఖలు చేసే వీలుండదని నోటిఫికేషన్ లో పేర్కొంది. ఈ నియమం జనవరి 1, 2022 నుండి అమల్లోకి వస్తుంది. (చదవండి: చిన్న సిటీలకు చిట్టి విమానం, రివ్వున ఎగిరేందుకు రెడీ)
Comments
Please login to add a commentAdd a comment