
మీ దగ్గర పాన్ కార్డు ఉందా? ఇంకా మీరు పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఇంకా లింక్ చేయలేదా? అయితే, వెంటనే లింక్ చేయండి. ఒకవేళ మీరు లింక్ చేయకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా రూ.1000 జరిమానా కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సమాచారాన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు తెలియజేస్తున్నాయి. పాన్ ఆధార్ లింక్ గడువు జూన్ 30తో ముగుస్తుంది. అంటే మీరు ఈ నెలలో చివరి వరకు కచ్చితంగా రెండింటినీ అనుసంధానం చేసుకోవాలి. లేకపోతే మీ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. దీంతో మీరు పాన్ కార్డును అవసరం ఉన్న చోట ఉపయోగించలేరు.
గతంలోనే మార్చి 30 వరకు ఉన్న పాన్-ఆధార్ లింక్ గడువును జూన్ 30 వరకు పొడగించింది. ఇప్పుడు మరోసారి పొడగించే అవకాశాలు కూడా తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ముందే మీరు లింక్ చేసుకోవడం మంచిది. మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే మీ పాన్ కార్డ్ పనిచేయదు. అలాగే బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో అసౌకర్యాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇంకా పెన్షన్, స్కాలర్‌షిప్, ఎల్‌పీజి సబ్సిడీ వంటి పథకాలకు ద్రవ్య ప్రయోజనాలను పొందేటప్పుడు పాన్ తప్పనిసరి. మీరు ఆధార్ - పాన్‌లను పలు మార్గాల్లో లింక్ చేయవచ్చు. పాన్-ఆధార్ లింక్‌ను ఆన్‌లైన్ (https://www.incometax.gov.in/iec/foportal/)లో చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment