june 30th
-
‘‘మన్ కీ బాత్ రిటర్న్స్’’.. 111వ ఎపిసోడ్ ఎప్పుడంటే..
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ రేడియో సందేశ కార్యక్రమం మన్ కీ బాత్ మళ్లీ ప్రారంభమవనుంది. జూన్ 30న 111వ ఎపిసోడ్‌తో ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభమవుతుందని ప్రధాని స్వయంగా వెల్లడించారు. ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంపై ఆలోచనలు, సూచనలు పంచుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ‘మన్ కీ బాత్’కార్యక్రమానికి బ్రేక్ పడింది. ‘కొన్ని నెలల విరామం తర్వాత ‘మన్ కీ బాత్’మళ్లీ ప్రారంభమవనుందని చెప్పడం సంతోషంగా ఉంది. జూన్ 30న 111వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇందుకు మీ ఆలోచనలు, సూచనలను పంచుకోవాలని కోరుతున్నా. మై గవ్ ఓపెన్ ఫోరమ్, నమో యాప్ లేదా 1800 11 7800 ఫోన్ నంబర్ ద్వారా అభిప్రాయాలను పంచుకోవాలి’అని ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రధాని మోదీ కోరారు. కాగా, ప్రతి నెల చివరి ఆదివారంలో వచ్చే ‘మన్ కీ బాత్’110వ ఎపిసోడ్ ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రసారం అయ్యింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. -
భక్తులకు గుడ్ న్యూస్.. అమర్నాథ్ యాత్ర ఎప్పుడంటే..?
సాక్షి, న్యూఢిల్లీ: భక్తులకు అమర్నాథ్ దేవస్థానం బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జరగబోయే అమర్నాథ్ యాత్రపై ఆదివారం కీలక ప్రకటన చేసింది. జూన్ 30వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్రను ప్రారంభించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఆదివారం జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన అమర్నాథ్ దేవస్థానం బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఏడాది అమర్నాథ్ యాత్రను జూన్ 30న ప్రారంభించి, సంప్రదాయం ప్రకారం రక్షాబంధన్ రోజుతో యాత్రను ముగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈసారి భక్తులకు దాదాపు 43 రోజుల పాటు మంచులింగాన్ని దర్శించుకునేందుకు అవకాశం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. కరోనా తీవ్రత ఇంకా పూర్తి స్థాయిలో తగ్గని నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించారు. అయితే, కరోనా కారణంగా గత రెండేళ్లుగా భక్తుల రాకపై ఆంక్షలు విధించారు. దీంతో ఈ ఏడాది భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నట్టు బోర్డు సభ్యులు చెబుతున్నారు. Amaranth Yatra to start from June 30th, 2022, with all covid protocols in place & culminate, as per the tradition, on the day of Raksha Bandhan. The Amarnath Yatra will last for 43 days this year: Office of Lt. Governor of Jammu & Kashmir — ANI (@ANI) March 27, 2022 -
పాన్ - ఆధార్ లింకు గడువు కొద్ది రోజులే!
మీ దగ్గర పాన్ కార్డు ఉందా? ఇంకా మీరు పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఇంకా లింక్ చేయలేదా? అయితే, వెంటనే లింక్ చేయండి. ఒకవేళ మీరు లింక్ చేయకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా రూ.1000 జరిమానా కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సమాచారాన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు తెలియజేస్తున్నాయి. పాన్ ఆధార్ లింక్ గడువు జూన్ 30తో ముగుస్తుంది. అంటే మీరు ఈ నెలలో చివరి వరకు కచ్చితంగా రెండింటినీ అనుసంధానం చేసుకోవాలి. లేకపోతే మీ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. దీంతో మీరు పాన్ కార్డును అవసరం ఉన్న చోట ఉపయోగించలేరు. గతంలోనే మార్చి 30 వరకు ఉన్న పాన్-ఆధార్ లింక్ గడువును జూన్ 30 వరకు పొడగించింది. ఇప్పుడు మరోసారి పొడగించే అవకాశాలు కూడా తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ముందే మీరు లింక్ చేసుకోవడం మంచిది. మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే మీ పాన్ కార్డ్ పనిచేయదు. అలాగే బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో అసౌకర్యాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇంకా పెన్షన్, స్కాలర్షిప్, ఎల్పీజి సబ్సిడీ వంటి పథకాలకు ద్రవ్య ప్రయోజనాలను పొందేటప్పుడు పాన్ తప్పనిసరి. మీరు ఆధార్ - పాన్లను పలు మార్గాల్లో లింక్ చేయవచ్చు. పాన్-ఆధార్ లింక్‌ను ఆన్లైన్ (https://www.incometax.gov.in/iec/foportal/)లో చేయవచ్చు. చదవండి: పూచీకత్తు లేకుండానే రూ.5 లక్షల పర్సనల్ లోన్ -
కంటైన్మెంట్ జోన్లలో జూన్ 30వరకు లాక్డౌన్
-
ఈ జూన్ 30న ఒక సెకను పెంచుకోవాల్సిందే!
వాషింగ్టన్: ఒక రోజుకు ఎన్నిగంటలు, ఎన్ని నిమిషాలు అంటే కనీస పరిజ్ఞానం ఉన్న వారెవరైనా చెప్పేస్తారు? రోజుకు ఎన్ని సెకన్లు ఉంటాయని అడిగితే మాత్రం కచ్చితంగా చెప్పడం కాస్త కష్టంగానే ఉంటుంది. అయితే జూన్ 30వ తేదీ మన దీర్ఘకాలిక జ్ఞాపకంలో చెరగని ముద్ర వేసే అవకాశం ఉంది. సాధారణంగా రోజుకు 86, 400 సెకన్లు. కాగా, ఈ జూన్ 30 మాత్రం మామూలు రోజుకన్నా కాస్త ఎక్కువగా ఉంటుందట. జూన్ 30 వ తేదీకి అదనంగా ఒక లీపు సెకను ఎందుకు జోడించాల్సి వచ్చిందో అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం(నాసా) వెల్లడించింది. భూమి తన చుట్టూ తిరిగే పరిభ్రమణ కాస్త తగ్గుతూ ఉండటంతో ఆ లోటును భర్తీ చేయడానికి అదనంగా ఒక లీపు సెకనును జోడించినట్లు నాసా పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా యుటిసిగా పికోర్డినేటెడ్ యూనివర్సల్ టైమింగ్ విషయానికి మాత్రమే ఇది వర్తిస్తుంది. యుటిసి అనేది ఆటోమేటిక్ టైమ్. ఈ కచ్చితమైన సమయం ఇప్పుడు తెలియకపోయినా.. 14,00,000 సంవత్సరాలకు ఒకసారి సమయ మార్పు తెలిసే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం భూ పరిభ్రమణం తగ్గుతూ రావడంతో ఇలా ఒక సెకను అదనంగా జోడించాల్సి వచ్చిందట. దీంతో జూన్ 30 వ తేదీకి 86, 401 సెకన్లుగా నిర్ణయించాల్సి వచ్చిందని నాసా తెలిపింది. ఒక రోజు 23:59:59 సెకన్ల వద్ద ముగిసి 00:00:00తో ప్రారంభమవుతుంది. జూన్ 30 వ తేదీన 23:59:60 సెకన్ల వద్ద ముగిసి 00:00:00 తో ఆరంభం కానుంది. గత 15 సంవత్సరాల నుంచి ఈ జూన్ వరకూ చూస్తే ఇలా లీపు సెకను పెంచడం నాల్గోసారి. ఇలా అరుదుగా జరిగే విషయాలు మనలో ఆసక్తిని పెంచినా.. ఆరోజు నుంచి గడియారాల్లో ఒక సెకనును అదనంగా పెంచుకుందామా మరి.