
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ రేడియో సందేశ కార్యక్రమం మన్ కీ బాత్ మళ్లీ ప్రారంభమవనుంది. జూన్ 30న 111వ ఎపిసోడ్‌తో ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభమవుతుందని ప్రధాని స్వయంగా వెల్లడించారు. ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంపై ఆలోచనలు, సూచనలు పంచుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ‘మన్ కీ బాత్’కార్యక్రమానికి బ్రేక్ పడింది. ‘కొన్ని నెలల విరామం తర్వాత ‘మన్ కీ బాత్’మళ్లీ ప్రారంభమవనుందని చెప్పడం సంతోషంగా ఉంది. జూన్ 30న 111వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇందుకు మీ ఆలోచనలు, సూచనలను పంచుకోవాలని కోరుతున్నా.
మై గవ్ ఓపెన్ ఫోరమ్, నమో యాప్ లేదా 1800 11 7800 ఫోన్ నంబర్ ద్వారా అభిప్రాయాలను పంచుకోవాలి’అని ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రధాని మోదీ కోరారు. కాగా, ప్రతి నెల చివరి ఆదివారంలో వచ్చే ‘మన్ కీ బాత్’110వ ఎపిసోడ్ ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రసారం అయ్యింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది.
Comments
Please login to add a commentAdd a comment