ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైన విషయం విధితమే. అయితే ఈ మ్యాచ్‌లో భారత ఓటమి చవిచూసినప్పటకి.. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మాత్రం తన విరోచిత పోరాటంతో ఆకట్టుకున్నాడు.
విరాట్ కోహ్లి, గిల్, జైశ్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు కివీస్ స్పిన్నర్ల వలలో చిక్కుకున్న విలవిల్లాడిన చోట రిషబ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ భారత్ డగౌట్‌లో ఆశలు రేకెత్తించాడు. కానీ అనూహ్యంగా పంత్ ఔట్ కావడంతో మ్యాచ్ భారత్ చేజారిపోయింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 57 బంతులు ఎదుర్కొన్న పంత్ 9 ఫోర్లు, 1 సిక్సర్‌తో 64 పరుగులు చేసి ఔటయ్యాడు.
కివీస్ సిరీస్ అసాంతం పంత్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 89.38 స్ట్రైక్ రేటుతో పంత్ 261 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్‌పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ప్రశంసల వర్షం కురిపించాడు. పంత్ బ్యాటింగ్ టెక్నిక్‌ను బాసిత్ అలీ మెచ్చుకున్నాడు. అదేవిధంగా ఐపీఎల్-2025 మెగా వేలంలో పంత్ రూ. 50 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోతాడని అలీ జోస్యం చెప్పాడు.
రూ. 50 కోట్లు ఇవ్వాలి..
"రిషబ్ పంత్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ వికెట్‌పై మిగితా ప్లేయర్లంతా ఇబ్బంది పడితే పంత్ ఒక్కడే ప్రత్యర్ధి బౌలర్లను ఎటాక్ చేశాడు. అతడు ప్లాట్ పిచ్‌పై ఆడుతున్నట్లు బ్యాటింగ్ చేశాడు. అతడి షాట్ సెలక్షన్ గురుంచి ఎంతచెప్పుకున్న తక్కువే.
అతడు ఎటువైపు ఆడాలనుకుంటే ఆటువైపు ఈజీగా షాట్‌లు ఆడాడు. మిగితా ఆటగాళ్లు పంత్‌లా ఆడలేకపోయారు. రిషబ్ తొలి ఇన్నింగ్స్‌లో 60, రెండో ఇన్నింగ్స్‌లో 64 పరుగులు చేశాడు. అతడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు అమ్ముడుపోతాడు. పంత్ రూ.25 కోట్లకు అమ్ముడుపోతాడని అంతా అనుకుంటున్నారు.
కానీ నావరకు అయితే పంత్‌కు రూ. 50 కోట్లు ఇచ్చి తీసుకున్నా తప్పులేదు అని తన యూట్యూబ్ ఛానల్‌లో అలీ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు రిషబ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.
చదవండి: IND vs NZ: టీమిండియాపై సచిన్ సీరియస్.. అసలు తప్పు ఎక్కడ జరిగింది?
Comments
Please login to add a commentAdd a comment