
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌కు షాక్ తగిలింది. భారీ ధరకు అమ్ముడుపోతాడనుకున్న రాహుల్‌ను నామమాత్రపు ధరకే ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. రూ. 14 కోట్లకు రాహుల్‌ను ఢిల్లీ సొంతం చేసుకుంది.
రూ. 2 కోట్ల కనీస ధరతో ఈ వేలంలో వచ్చిన రాహుల్ కోసం తొలుత రాయల్ ఛాలెంజర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ పోటీ పడ్డాయి. ఈ రెండు ఫ్రాంచైజీలు అతడిని దక్కించుకోవడానికి ప్రయత్నించాయి. అయితే మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఎంట్రీ ఇచ్చాయి. దీంతో ఆర్సీబీ, కేకేఆర్ వెనక్కి తగ్గాయి.
అయితే ఆఖరికి సీఎస్‌కే కూడా పోటీ నుంచి తప్పుకోవడంతో రాహుల్ ఢిల్లీ సొంతమయ్యాడు. అతడికి ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టు పగ్గాలను అప్పగించే అవకాశముంది. కాగా ఈ వేలంలో ఆర్సీబీ రాహుల్‌ను కొనుగోలు చేస్తుందని జోరుగా ప్రచారం సాగింది. కానీ వేలంలో మాత్రం అతడికి కోసం ఆర్సీబీ ప్రయత్నించలేదు.
కాగా ఐపీఎల్-2022 నుంచి 2024 వరకు రాహుల్ లక్నో కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెండుసార్లు ఆ జట్టును ప్లే ఆఫ్స్‌చేర్చాడు. కానీ అతడిని ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు లక్నో రిటైన్ చేసుకోలేదు. అందుకు జట్టు యాజమాని సంజీవ్ గోయెంకాతో విభేదాలే కారణమని వార్తలు వినిపించాయి.
కాగా ఐపీఎల్‌లో రాహుల్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 132 మ్యాచ్‌లు ఆడిన రాహుల్.. 45.47 సగటుతో 4683 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 37 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి.
చదవండి: Yuzvendra Chahal: వేలంలో చహల్‌కు కళ్లు చెదిరే ధర.. జాక్‌పాట్ కొట్టేశాడు
Comments
Please login to add a commentAdd a comment