టీమిండియా తరుపున అరంగేట్రంలోనే సెంచరీ చేసిన ఆటగాళ్లలో పృథ్వీ షా ఒకరు. తొలుత అతడి ఆట తీరును చూసి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పోల్చారు. కానీ ఆ తర్వాత క్రమశిక్షణారాహిత్యం, ఫిట్‌నెస్ ఫామ్ లేమి కారణంగా భారత జట్టులో చోటు కోల్పోయాడు.
క్రమంగా తన ఫిట్‌నెస్‌ను కూడా కోల్పోయిన పృథ్వీ షా ముంబై రంజీ జట్టుకు కూడా దూరమయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్ ఆడే అవకాశం కూడా ఈ ముంబై ప్లేయర్ కోల్పోయాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలోనూ పృథ్వీ షాను ఒక్క ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.
2018 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అరంగేట్రం చేసిన షా.. అప్పటి నుంచి గత సీజన్ వరకు ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ రిటైన్ చేసుకోలేదు. ఈ నేపథ్యంలోనే రూ. 75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు.
దీంతో పృథ్వీ షాను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రోల్స్‌పై పృథ్వీ షా మాట్లాడిన ఓ పాత వీడియో ఒకటి సోషల్ మీడియా ఒకటి వైరలవుతోంది. తన కెరీర్ ఆసాంతం ట్రోలింగ్ ఎదుర్కొన్నట్లు షా చెప్పుకొచ్చాడు.
ఎవరైనా ఒక వ్యక్తి నన్ను ఫాలో కాకపోతే.. నన్ను మీరేలా ఎలా ట్రోల్ చేస్తారు? అంటే అతడి కళ్లన్నీ నా మీదే ఉన్నాయని ఆర్దం. ట్రోలింగ్ చేయడం మంచిది కాదు, కానీ అది అంత చెడ్డ విషయం కూడా కాదు. అయితే దేనికైనా ఓ హద్దు ఉంటుంది.
ఆ హద్దు దాటి వారిని టార్గెట్ చేయడం మంచిది కాదు. క్రికెటర్లతో పాటు ఇతర వ్యక్తులను ట్రోల్ చేయడం నేను చాలా సందర్బాల్లో చూశాను. నాపై చేస్తున్న ట్రోలింగ్‌లు, మీమ్‌లు అన్నీ చూస్తున్నాను. అటువంటి చూసి నేను బాధపడిన సందర్భాలు ఉన్నాయి.
నేను బయట కన్పిస్తే చాలు ప్రాక్టీస్ చేయకుండా తిరుగుకుంటున్నాడని కామెంట్లు చేస్తున్నారు. నా పుట్టిన రోజున కూడా నేను బయటకు వెళ్లకూడదా? నేను ఏమి తప్పుచేశానో కూడా నాకే ఆర్ధం కావడం లేదు. కానీ మనం ఏమి చేసినా తప్పుబట్టేవాళ్లు ఉంటారని మాత్రం ఆర్ధం చేసుకున్నా అని ఆ వీడియోలో పృథ్వీ షా పేర్కొన్నాడు.
చదవండి: ICC Rankings: సత్తాచాటిన జైశ్వాల్.. నెం1 ర్యాంక్‌కు ఒక్క అడుగు దూరంలో
Comments
Please login to add a commentAdd a comment