ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్ రిషబ్ పంత్‌ను విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్‌లను మాత్రమే ఢిల్లీ రిటైన్ చేసుకుంది. అయితే పంత్‌ను వేలంలోకి విడిచిపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఇప్పుడు తమ కొత్త కెప్టెన్‌ను వెతికే పనిలో పడింది.
ఈ క్రమంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై ఢిల్లీ యాజమాన్యం కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరిలో జరగనున్న మెగా వేలంలో అయ్యర్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని సదరు ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్-2024లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్‌కు తమ జట్టు పగ్గాలు అప్పగించాలని జీఎంఆర్( (GMR) గ్రూప్ యోచిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
మళ్లీ సొంతగూటికి?
కాగా ఢిల్లీ ఫ్రాంచైజీతో శ్రేయస్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అయ్యర్ 2015లో ఢిల్లీ ఫ్రాంచైజీ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అప్పటి ఢిల్లీ డేర్‌డేవిల్స్ అతడిని రూ.2.5 కోట్లకు కొనుగోలు చేసింది. తన అరంగేట్రం నుంచి ఐపీఎల్-2021 వరకు ఢిల్లీ ఆధారిత ఫ్రాంచైజీకే అయ్యర్ ప్రాతినిథ్యం వహించాడు.
అంతేకాకుండా మూడు సీజన్ల పాటు ఢిల్లీ కెప్టెన్‌గా కూడా శ్రేయస్ వ్యవహరించాడు. ఐపీఎల్-2020లో అయ్యర్ సారథ్యంలోనే ఢిల్లీ ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత అయ్యర్ తరుచూ గాయాల బారిన పడటంతో ఢిల్లీ యాజమాన్యం ఐపీఎల్-2022 సీజన్ ముందు విడిచిపెట్టింది.
ఈ క్రమంలో అయ్యర్ స్ధానంలోనే తమ రెగ్యూలర్ కెప్టెన్‌గా రిషబ్‌ను ఢిల్లీ నియమించింది. ఇప్పుడు మళ్లీ రివర్స్‌గా రిషబ్‌ను విడిచిపెట్టి అయ్యర్‌ను తమ సారథిగా నియమించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఢిల్లీ పర్స్‌లో ప్రస్తుతం రూ.73 కోట్లు ఉన్నాయి. వేలంలో ఈ భారీ మొత్తాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీ ఖర్చుచేయనుంది.
చదవండి: IND vs NZ: నా బౌలింగ్‌లోనే సిక్సర్లు కొడతావా? కసి తీర్చుకున్న అశ్విన్! వీడియో
Comments
Please login to add a commentAdd a comment