ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా ఆటగాడు పృథ్వీ షాకు తీవ్ర నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. రూ.75 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి అడుగుపెట్టిన పృథ్వీ షాను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ ముంబై ఓపెనర్.. అప్పటి నుంచి ఆ ఫ్రాంచైజీకే ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్నాడు.
కానీ ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి ముందు షాను ఢిల్లీ రిటైన్ చేసుకోలేదు. దీంతో వేలంలోకి వచ్చిన అతడిని కనీసం వేరే ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుందని భావించారు. కానీ ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు.
అందుకు కారణాలు లేకపోలేవు. పృథ్వీ షా ప్రస్తుతం పేలవ ఫామ్, ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. అంతేకాకుండా అతడిలో క్రమశిక్షణ కూడా లోపించింది. ఈ కారణాల చేతనే షాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలో పృథ్వీ షాపై ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ అసిస్టెంట్ కోచ్ మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కనీస ధరకు కూడా వేలంలో అమ్ముడుపోనుందన పృథ్వీ సిగ్గుపడాలంటూ కైఫ్ తీవ్ర స్ధాయిలో మండిపడ్డాడు.
పృథ్వీ సిగ్గు పడాలి: కైఫ్
"ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ పృథ్వీ షాకు చాలా సపోర్ట్ చేసింది. అతడు పవర్ ప్లేలో అద్బుతంగా ఆడుతాడని, ఒకే ఓవర్‌లో 6 బౌండరీలు కొట్టగలిగే సత్తా ఉందని ఢిల్లీ నమ్మింది. కొన్ని సీజన్లలో ఢిల్లీ నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు.
ఢిల్లీ ఫ్రాంచైజీ ఆశించినట్టే ఒకే ఓవర్‌లో 6 ఫోర్లు కొట్టి చూపించాడు. అతడికి చాలా అతడు బాగా ఆడితేనే మేము గెలుస్తామని భావించేవాళ్లం. కాబట్టి అతడికి ప్రతీ మ్యాచ్‌లోనూ అవకాశం ఇచ్చాము. కొన్ని సార్లు వరుసగా విఫలమైనా కూడా మేము సపోర్ట్ చేస్తూనే వచ్చాం. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి అతడికి జట్టులో అవకాశమివ్వకూడదని చాలా సందర్భాల్లో నిర్ణయించుకున్నాం.
కానీ ఆ తర్వాత మ్యాచ్ రోజున మా మా నిర్ణయాన్ని మార్చుకుని అతడికి ఛాన్స్ ఇచ్చేవాళ్లం. ఎందుకంటే అతడు పెద్ద ఇన్నింగ్స్ ఆడితే గెలుస్తామన్న నమ్మకం మాకు ఉండేది. కానీ అతడు మాత్రం తనకు ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాడు.
దీంతో అతడిని ఢిల్లీ కూడా విడిచిపెట్టింది. కనీస ధర 75 లక్షలతో వేలంలోకి వచ్చిన అతడు అమ్ముడుపోకపోవడం నిజంగా సిగ్గుచేటు. పృథ్వీ షా తిరిగి వెనక్కి వెళ్లి బేసిక్స్ నేర్చుకోవాలి అంటూ జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైఫ్ పేర్కొన్నాడు.
చదవండి: వెంకటేశ్ అయ్యర్, నరైన్ కాదు.. కేకేఆర్ కెప్టెన్‌గా అతడే!?
Comments
Please login to add a commentAdd a comment