ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి సర్వం సిద్దమైంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌథీ అరేబియాలోని జెడ్డా నగరంలో ఈ క్యాష్ రిచ్ లీగ్ మెగా వేలం జరగనుంది. ఈ మెగా వేలం కోసం మొత్తం అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే జెడ్డాకు చేరుకున్నాయి. ఈ ఆక్షన్‌లో అనుసరించాల్సిన వ్యూహాలను ఆయా ఫ్రాంచైజీలు సిద్దం చేసుకున్నాయి.
మరోవైపు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, జోస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ క్రికెటర్లు ఈ వేలంలో భాగం కావడంతో అభిమానులు సైతం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మెగా వేలానికి ఒక్క రోజు ముందు అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియో సినిమా "మెగా వేలం వార్ రూమ్" పేరిట ఓ కార్యక్రమం నిర్వహించింది.
"మెగా వేలం వార్ రూమ్‌లో క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ సంజయ్ బంగర్, ఆకాష్ చోప్రా, సురేష్ రైనా, రాబిన్ ఉతప్ప, ఇయాన్ మోర్గాన్, దీప్ దాస్ గుప్తా, ఎస్ బద్రీనాథ్, హనుమా విహారీ, అభినవ్ ముకుంద్,మైక్ హెస్సన్‌లు మొత్తం పాల్గోనున్నారు. ఒక్కొక్కరు ఒక్కో ఫ్రాంచైజీ ప్రతినిధులగా వ్యవహరించారు.
రిషబ్ పంత్‌కు రూ.33 కోట్లు!
ఇక "మెగా వేలం వార్ రూమ్"లో టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ భారీ ధర పలికాడు. పంత్‌ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.33 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. పంత్ కోసం కేకేఆర్, పంజాబ్ కింగ్స్ ఆఖరి వరకు తీవ్రంగా పోటీ పడ్డాయి.
కానీ పంజాబ్‌కు ప్రతినిథిగా వ్యహరించిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఏ మాత్రం వెనక్కుతగ్గలేదు. చివరికి కేకేఆర్ పోటీ నుంచి తప్పుకోవడంతో పంత్ పంజాబ్ సొంతమయ్యాడు. కాగా రియల్ వేలంలో పంత్ తన కనీస ధరను రూ. 2 కోట్లగా నమోదు చేసుకున్నాడు.
అయితే పంత్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉండడంతో ఈ వేలంలో కాసుల వర్షం కురిసే అవకాశముంది. పంత్‌కు ఐపీఎల్‌లో మెరుగైన రికార్డు ఉంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 111 మ్యాచ్‌లు ఆడిన ఈ ఢిల్లీ చిచ్చర పిడుగు 148.93 స్ట్రైక్ రేట్‌తో 3284 పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజన్‌లో కూడా పంత్ సత్తాచాటాడు. 13 మ్యాచ్‌ల్లో 40 సగటుతో 446 పరుగులు చేశాడు.
చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
Comments
Please login to add a commentAdd a comment