
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత క్రికెట్ జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడేందుకు సిద్దమైంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కూడా గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో సెమీస్‌లో అడుగుపెట్టాలని భారత జట్టు భావిస్తోంది.
ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే గ్రూప్ టాపర్‌గా సెమీఫైనల్లో ఆ్రస్టేలియాతో తలపడుతుంది. ఓడితే సెమీస్‌లో దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు మెనెజ్‌మెంట్‌కు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక సూచనలు చేశాడు. తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన ఆటగాళ్లను కివీస్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడించాలని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
"కివీస్‌తో మ్యాచ్‌లో భారత్ తమ తమ బెంచ్ బలాన్ని పరీక్షించుకోవాలి. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌లకు ఆడే అవకాశం ఇవ్వండి. మొదటి రెండు మ్యాచ్‌లకు వీరిద్దరూ బెంచ్‌కే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు అన్ని విధాల ప్రయత్నించిండి. గెలిస్తే ఆస్ట్రేలియాతో ఆడుతారు.
లేదంటే దక్షిణాఫ్రికాతో తలపడతారు. అంతేతప్ప ఓడినంతమాత్రాన భారత జట్టుకు పెద్దగా నష్టం లేదు. కాబట్టి నావరకు అయితే తుది జట్టులో మార్పులు చేస్తే బెటర్" అని మంజ్రేకర్ జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
కాగా కివీస్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చోటు చేసుకునే సూచనలు కన్పిస్తున్నాయి. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి మెనెజ్‌మెంట్ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ జట్టులో వచ్చే అవకాశముంది. అదేవిధంగా కేఎల్ రాహుల్ స్ధానంలో రిషబ్ పంత్ జట్టులోకి రానున్నట్లు సమచారం.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), శుబ్‌మన్ గిల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్.
న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్ ), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డార్లీ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్‌వెల్, జేమీసన్,హెన్రీ, రూర్కే.
చదవండి: Champions Trophy: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి..
Comments
Please login to add a commentAdd a comment