యూవీ కంటతడి.. చలించిన బిగ్ బీ | Yuvraj Singh Gets Emotional On KBC Show | Sakshi
Sakshi News home page

యూవీ కంటతడి.. చలించిన బిగ్ బీ

Published Sun, Nov 5 2017 9:47 AM | Last Updated on Sun, Nov 5 2017 12:31 PM

Yuvraj Singh Gets Emotional On KBC Show - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : వివాద రహితుడిగా, తన రికార్డులతో అశేష అభిమానులను సంపాదించుకున్నాడు టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్‌ యువరాజ్‌ సింగ్. అయితే కొన్నేళ్ల క్రితం యూవీ కేన్సర్ వ్యాధిని జయించాడు. ఆ సమయంలో తాను ఎదుర్కున్న అనుభవాలను మరోసారి నెమరువేసుకుని కంటతడి పెట్టుకున్నాడు.

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌ గా కౌన్ బనేగా కరోడ్‌పతి 9వ సీజన్‌ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఆ షో కోసం నటి విద్యాబాలన్‌తో యూవీ కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడ యూవీ ఆ సమయంలో తాను ఎదుర్కున్న భయనక అనుభావాలను చెబుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు. ఓ సారి నిద్రలేచే సరికి నోటి నుంచి ఎర్ర రంగులో తెమడ బయటికి రావటం,  ఆ తర్వాత రోజురోజుకీ త‌న‌ ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చిందని యూవీ చెప్పాడు. క్రికెట్ మానేసి వెంటనే చికిత్స తీసుకోకపోతే ఎక్కువ కాలం బతికలేవని వైద్యులు చెప్పారని.. ఆ సమయంలో తాను నరకం చవి చూశానని చెబుతూ క‌న్నీరు పెట్టుకున్నాడు.

యూవీ ఎమోషల్‌ మాటలకు చలించిన బిగ్ బీని, ఓదార్చిన విద్యాబాలన్‌ను ఈ మధ్య కేబీసీ వాళ్లు విడుదల చేసిన ఆ ప్రోమోలో చూడొచ్చు. అలాంటి పరిస్థితి నుంచి ప్రాణాలతో బయటపడ్డ యూవీ ప్రస్తుతం ఓ ఫౌండేష‌న్‌ను స్థాపించి కేన్సర్ బాధితులకు మనోధైర్యం అందిస్తూ రియల్ హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement