KBC 9
-
యూవీ కంటతడి.. చలించిన బిగ్ బీ
-
యూవీ కంటతడి.. చలించిన బిగ్ బీ
సాక్షి, స్పోర్ట్స్ : వివాద రహితుడిగా, తన రికార్డులతో అశేష అభిమానులను సంపాదించుకున్నాడు టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్. అయితే కొన్నేళ్ల క్రితం యూవీ కేన్సర్ వ్యాధిని జయించాడు. ఆ సమయంలో తాను ఎదుర్కున్న అనుభవాలను మరోసారి నెమరువేసుకుని కంటతడి పెట్టుకున్నాడు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా కౌన్ బనేగా కరోడ్‌పతి 9వ సీజన్ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఆ షో కోసం నటి విద్యాబాలన్‌తో యూవీ కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడ యూవీ ఆ సమయంలో తాను ఎదుర్కున్న భయనక అనుభావాలను చెబుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు. ఓ సారి నిద్రలేచే సరికి నోటి నుంచి ఎర్ర రంగులో తెమడ బయటికి రావటం, ఆ తర్వాత రోజురోజుకీ తన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చిందని యూవీ చెప్పాడు. క్రికెట్ మానేసి వెంటనే చికిత్స తీసుకోకపోతే ఎక్కువ కాలం బతికలేవని వైద్యులు చెప్పారని.. ఆ సమయంలో తాను నరకం చవి చూశానని చెబుతూ కన్నీరు పెట్టుకున్నాడు. యూవీ ఎమోషల్ మాటలకు చలించిన బిగ్ బీని, ఓదార్చిన విద్యాబాలన్‌ను ఈ మధ్య కేబీసీ వాళ్లు విడుదల చేసిన ఆ ప్రోమోలో చూడొచ్చు. అలాంటి పరిస్థితి నుంచి ప్రాణాలతో బయటపడ్డ యూవీ ప్రస్తుతం ఓ ఫౌండేషన్‌ను స్థాపించి కేన్సర్ బాధితులకు మనోధైర్యం అందిస్తూ రియల్ హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు. -
పీవీ సింధుకు ‘వైఎస్సార్’ ప్రశ్న.. రూ.25లక్షలు
సాక్షి, హైదరాబాద్ : భారత్‌తోపాటు విదేశాల్లో సైతం విపరీతంగా ప్రాచుర్యం పొందిన టీవీ కార్యక్రమం ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తొమ్మిదో సీజన్ ఇటీవలే ప్రారంభమైంది. అన్ని సీజన్లలాగే తాజా సీజన్ కూడా అద్భుతమైన రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. వీకెండ్స్, స్పెషల్ డేస్‌లో ప్రసారమయ్యే ఎపిసొడ్లలో పలువురు సెలబ్రిటీలు సందడిచేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. శుక్రవారం(అక్టోబర్ 6న) ప్రసారమైన కేబీసీ ఎపిసోడ్లో ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్రశ్నలకు సమాధానాలిచ్చి రూ.25 లక్షలు గెల్చుకున్నారు. కాగా, ఆమెకు 25 లక్షలు తెచ్చిపెట్టిన ప్రశ్న.. మహానేత వైఎస్సార్, ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిలకు సంబంధించింది కావడం విశేషం. తన సోదరి దివ్యతో కలిసి సింధు హాట్సీట్లో కూర్చున్నారు. సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి.. బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తీరును మాటలు, వీడియోల రూపంలో ప్రేక్షకులకు వివరించారు హోస్ట్ అమితాబ్. వైల్డ్ ఎంట్రీగా రూ.20వేల ప్రశ్నతో ఆటను ప్రారంభించిన సింధు.. 8వ ప్రశ్నకు సమాధానం చెప్పి రూ.25లక్షలు గెల్చుకున్నారు. అయితే, అప్పటికే సమయం మించిపోవడంతో ఎపిసొడ్ ముగిసినట్లైంది. తాను గెల్చుకున్న మొత్తాన్ని ఆస్పత్రికి వితరణ ఇవ్వనున్నట్లు సింధు ప్రకటించారు. వైఎస్సార్ అంటే ? : సింధును అమితాబ్ అడిగిన ఎనిమిదో ప్రశ్న.. ‘ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వై, ఎస్, ఆర్ పదాలకు అర్థాలేమిటి?’’ అని అడిగారు. ఎ)యువ సత్య రాజ్యం, బి)యెదుగూరి సందిట రాజశేఖర, సి)యూత్ షల్ రూల్, డి)యువజన శ్రామిక రైతు అనే ఆప్షన్లు ఇవ్వగా, సోదరి సహాయంతో సింధు ‘డి’ ని సమాధానంగా చెప్పారు. వైఎస్సార్ రైతుల కోసం ఎంతో కష్టపడ్డారు కాబట్టి ఆయన పేరుతో స్థాపించిన పార్టీ పేరులో ‘రైతు’ పదం ఉంటుందనే తాను ‘డి’ ఆప్షన్‌ను ఎంచుకున్నట్లు సింధు చెప్పారు. సరైన సమాధానం చెప్పిన సింధూను మెచ్చుకున్న అమితాబ్ కూడా వైఎస్సార్ రైతుల బాగు కోసం ఎంతో కష్టపడ్డారని కితాబిచ్చారు. ‘అమితాబ్’ అడిగిన ప్రశ్న కోసం ఈ వీడియోను వీక్షించండి -
పీవీ సింధుకు ‘వైఎస్సార్’ ప్రశ్న.. రూ.25లక్షలు
-
అభిమానులను హెచ్చరించిన అమితాబ్
ముంబై: పాపులర్ గేమ్ షో 'కౌన్ బనేగా కరోడ్ పతి' పేరుతో జరుగుతున్న మోసం పట్ల అప్రమత్తంగా ఉండాలని అభిమానులను అమితాబ్ బచ్చన్ హెచ్చరించారు. 'కేబీసీ 9' రిజిస్ట్రేషన్ల పేరుతో కొంతమంది మోసానికి పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ఇంకా ఫైనలైజ్ కాలేదని స్పష్టం చేశారు. 'కేబీసీ 9' రిజిస్ట్రేషన్ల పేరుతో స్కామ్ జరుగుతోందని, దీన్ని నమ్మిమోసపోవద్దని ట్విటర్ ద్వారా అభిమానులను కోరారు. సోని సంస్థ ఇంకా రిజిస్టేషన్లు మొదలు పెట్టలేదని వెల్లడించారు. మూడో సీజన్ మినహా మిగతా అన్ని కేబీసీలకు అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.