భారత్‌తోపాటు విదేశాల్లో సైతం విపరీతంగా ప్రాచుర్యం పొందిన టీవీ కార్యక్రమం ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తొమ్మిదో సీజన్ ఇటీవలే ప్రారంభమైంది. అన్ని సీజన్లలాగే తాజా సీజన్ కూడా అద్భుతమైన రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. వీకెండ్స్, స్పెషల్ డేస్‌లో ప్రసారమయ్యే ఎపిసొడ్లలో పలువురు సెలబ్రిటీలు సందడిచేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. శుక్రవారం(అక్టోబర్ 6న) ప్రసారమైన కేబీసీ ఎపిసోడ్‌లో ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్రశ్నలకు సమాధానాలిచ్చి రూ.25 లక్షలు గెల్చుకున్నారు. కాగా, ఆమెకు 25 లక్షలు తెచ్చిపెట్టిన ప్రశ్న.. మహానేత వైఎస్సార్, ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిలకు సంబంధించింది కావడం విశేషం. మెడికో అయిన తన చెల్లెలు దివ్యతో కలిసి సింధు హాట్‌సీట్లో కూర్చున్నారు. సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి.. బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తీరును మాటలు, వీడియోల రూపంలో ప్రేక్షకులకు వివరించారు హోస్ట్ అమితాబ్. వైల్డ్ ఎంట్రీగా రూ.20వేల ప్రశ్నతో ఆటను ప్రారంభించిన సింధు.. 8వ ప్రశ్నకు సమాధానం చెప్పి రూ.25లక్షలు గెల్చుకున్నారు. అయితే, అప్పటికే సమయం మించిపోవడంతో ఎపిసొడ్ ముగిసినట్లైంది. తాను గెల్చుకున్న మొత్తాన్ని ఆస్పత్రికి వితరణ ఇవ్వనున్నట్లు సింధు ప్రకటించారు.
పీవీ సింధుకు ‘వైఎస్సార్’ ప్రశ్న.. రూ.25లక్షలు
Published Sat, Oct 7 2017 8:06 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement