అభిమానులను హెచ్చరించిన అమితాబ్ | Big B warns fans against fake 'KBC 9' registrations | Sakshi
Sakshi News home page

అభిమానులను హెచ్చరించిన అమితాబ్

Published Sun, Jul 12 2015 12:59 PM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM

అభిమానులను హెచ్చరించిన అమితాబ్

అభిమానులను హెచ్చరించిన అమితాబ్

ముంబై: పాపులర్ గేమ్ షో 'కౌన్ బనేగా కరోడ్ పతి' పేరుతో జరుగుతున్న మోసం పట్ల అప్రమత్తంగా ఉండాలని అభిమానులను అమితాబ్ బచ్చన్ హెచ్చరించారు. 'కేబీసీ 9'  రిజిస్ట్రేషన్ల పేరుతో కొంతమంది మోసానికి పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ఇంకా ఫైనలైజ్ కాలేదని స్పష్టం చేశారు. 

'కేబీసీ 9'  రిజిస్ట్రేషన్ల పేరుతో స్కామ్ జరుగుతోందని, దీన్ని నమ్మిమోసపోవద్దని ట్విటర్ ద్వారా అభిమానులను కోరారు. సోని సంస్థ ఇంకా రిజిస్టేషన్లు మొదలు పెట్టలేదని వెల్లడించారు. మూడో సీజన్ మినహా మిగతా అన్ని కేబీసీలకు అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement