కౌన్‌ బనేగా కరోడ్‌పతిలో టీ20 వరల్డ్‌కప్‌నకు సంబంధించిన ప్రశ్న | T20 World Cup 2024 Related Question In KBC For 40000 INR | Sakshi
Sakshi News home page

కౌన్‌ బనేగా కరోడ్‌పతిలో టీ20 వరల్డ్‌కప్‌నకు సంబంధించిన ప్రశ్న

Published Wed, Sep 11 2024 3:17 PM | Last Updated on Wed, Sep 11 2024 5:05 PM

T20 World Cup 2024 Related Question In KBC For 40000 INR

ఇటీవలికాలంలో కౌన్‌ బనేగా కరోడ్‌పతి టీవీ షోలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువయ్యాయి. తొలి ఐదారు ప్రశ్నల్లో ఏదో ఒకటి క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నే ఉంటుంది. తాజాగా జరిగిన ఓ ఎడిసోడ్‌లోనూ క్రికెట్‌కు సంబంధించిన ఓ ప్రశ్న వచ్చింది. 40000 రూపాయల కోసం ఎదురైన ఆ ప్రశ్న ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించింది. 

ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. కింది నాలుగు ఆప్షన్స్‌లో ఎవరూ టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌ జట్టు సభ్యులు కాదు..? ఈ ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్స్‌ ఇలా ఉన్నాయి. ఏ-కుల్దీప్‌ యాదవ్‌, బి-రవీంద్ర జడేజా, సి-రవిచంద్రన్‌ అశ్విన్‌, డి-సూర్యకుమార్‌ యాదవ్‌. ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలిస్తే కామెంట్‌ రూపంలో తెలియజేయండి. 

కాగా, కౌన్‌ బనేగా కరోడ్‌పతి అనేది దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ నిర్వహించే టీవీ షో. ఇందులో కంటెస్టెంట్స్‌ కంప్యూటర్‌ సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకు వారి నిర్దిష్ట పారితోషికం లభిస్తుంది.

వరల్డ్‌ ఛాంపియన్‌గా భారత్‌
ఇదిలా ఉంటే, యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మెగా టోర్నీ ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై జయకేతనం ఎగురవేసి రెండోసారి టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. 

త్వరలో బంగ్లాదేశ్‌ సిరీస్‌
ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ కమిట్‌మెంట్స్‌ లేకపోవడంతో భారత ఆటగాళ్లు ఖాళీగా ఉన్నారు. ఈ నెల 19 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. తొలి టెస్ట్‌ చెన్నై వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి.. రెండో టెస్ట్‌ కాన్పూర్‌ వేదికగా సెప్డెంబర్‌ 27 నుంచి మొదలుకానుంది. అనంతరం​ అక్టోబర్‌ 6, 9, 12 తేదీల్లో గ్వాలియర్‌, ఢిల్లీ, హైదరాబాద్‌ వేదికలుగా మూడు టీ20లు జరుగనున్నాయి.

చదవండి: తలో స్థానం మెరుగుపర్చుకున్న రోహిత్‌, జైస్వాల్‌, విరాట్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement