కౌన్ బనేగా కరోడ్‌పతి(మీలో ఎవరు కోటీశ్వరులు) షోలో అమితాబ్ బచ్చన్ ఎప్పటికప్పుడు తన గురించి కొత్త విషయాలు చెప్తూనే ఉంటాడు. సినిమా సంగతులను కంటెస్టెంట్లతో పంచుకుంటాడు. అలా తాజా ఎపిసోడ్‌లో ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.
స్టేడియంలో షూటింగ్
యారన్ సినిమాలో సారా జమానా అనే హిట్ సాంగ్ ఉంది. దాన్ని స్టేడియంలో షూట్ చేస్తే బాగుంటుందని నేనే సలహా ఇచ్చాను. సరిగ్గా అదే సమయంలో కోల్‌కతాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టేడియం కొత్తగా ఓపెన్ చేశారు. 12 వేల నుంచి 15 వేల కూర్చోగలిగే ఆ స్టేడియంలోకి ఏకంగా 50 వేల నుంచి 60 వేల మంది దాకా వచ్చారు.
రాత్రిళ్లు షూట్ చేద్దామని..
పరిస్థితి చేయిదాటడంతో షూటింగ్ ఆపేసి ముంబై వెళ్లిపోయాం. అయితే ఎవరికీ తెలియకుండా రాత్రిళ్లు షూట్ చేద్దామన్నాను. అలా కొద్దిరోజులకే గుట్టుచప్పుడు కాకుండా కోల్‌కతాకి వచ్చే స్టేడియంలో నైట్ షూట్ చేశాం. సీట్లు ఖాళీగా కనిపిస్తే బాగోదని డైరెక్టర్ క్యాండిల్స్ పెట్టాడు.
కరెంట్ షాక్‌తో డ్యాన్స్
నాకేమో ఎలక్ట్రిక్ జాకెట్ తొడిగించారు. అప్పుడు టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందలేదు. నా జాకెట్‌కు లైట్స్ రావాలంటే ప్లగ్ బోర్డు దగ్గర స్విచ్ ఆన్ చేయాలి. ఆ స్విచ్ ఆన్ చేయగానే నాకు కరెంట్ షాక్ తగిలి ఆటోమేటిక్‌గా డ్యాన్స్ చేశాను అని బిగ్‌బీ నవ్వుతూ చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment