బిగ్‌బాస్‌ హౌస్‌లో భూకంపం.. ఏకంగా 12 వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు! | Bigg Boss 8 Telugu: 12 Wild Card Entries After Two Weeks | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ చరిత్రలో తొలిసారి.. ఏకంగా 12 వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు! ఆపే పవర్‌ కూడా..!

Published Wed, Sep 25 2024 4:16 PM | Last Updated on Wed, Sep 25 2024 4:31 PM

Bigg Boss 8 Telugu: 12 Wild Card Entries After Two Weeks

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రస్తుతం నిఖిల్‌, సీత చీఫ్‌లుగా ఉన్నారు. రెండు టీముల్లో నచ్చినవాటికి వెళ్లమంటే పృథ్వీ, సోనియా తప్ప మిగతా అందరూ సీత టీమ్‌కే జై కొట్టారు. నిఖిల్‌ టీమ్‌కు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. అంటే సోనియా వల్ల నిఖిల్‌పై ఎంత వ్యతిరేకత వచ్చిందో అర్థమవుతోంది.

శక్తి టీమ్‌కు వెళ్లేదే లేదన్న హౌస్‌మేట్స్‌
కానీ బిగ్‌బాస్‌ ఊరుకుంటాడా? కచ్చితంగా ఇద్దరయినా నిఖిల్‌(శక్తి) టీమ్‌కు వెళ్లాల్సిందేనని కండీషన్‌ పెడతాడు. దీంతో చివరగా మిగిలిన మణికంఠ, ప్రేరణ అతడి టీమ్‌లోకి వెళ్లాల్సింది. కానీ ప్రేరణ.. ఆ టీమ్‌లో అడ్జస్ట్‌ అవలేదని అర్థం చేసుకున్న యష్మి.. ఆమెకు బదులుగా తాను ఆ టీమ్‌లో చేరింది.

బిగ్‌బాస్‌ చరిత్రలోనే తొలిసారి!
తాజాగా బిగ్‌బాస్‌.. హౌస్‌లో భూకంపం అంటూ మరో బాంబ్‌ పేల్చాడు. ఇంట్లోకి వచ్చేందుకు 12 మంది వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు రెడీగా ఉన్నాయన్నాడు. కాకపోతే ఆ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలకు అడ్డుకట్ట వేసే అవకాశాన్ని హౌస్‌మేట్స్‌కు ఇచ్చాడు. తాను ఇచ్చిన ఛాలెంజ్‌ గెలిచినప్పుడల్లా ఒక వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీని ఆపొచ్చన్నాడు. ఇందుకు రెండు వారాలపాటు గడవు ఇచ్చాడు.

వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీస్‌..
అంటే సరిగ్గా దసరా రోజు మిగిలిన వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలను హౌస్‌లోకి పంపిస్తారన్నమాట! ఇప్పటికైతే ముక్కు అవినాష్‌, నయని పావని, హరితేజ, రోహిణి.. వైల్డ్‌కార్డ్‌ కంటెస్టెంట్లుగా కన్ఫామ్‌ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. మరి వీరితో పాటు ఇంకెవరు వస్తున్నారో చూడాలి!

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement