KBC First Woman Crorepati Had No Bank Account and Pan Card - Sakshi
Sakshi News home page

KBC: కేవలం మూడు రూపాయలతో కోటి గెలిచింది.. ఇప్పుడేమో ఏకంగా!

Published Mon, Aug 21 2023 4:10 PM | Last Updated on Mon, Aug 21 2023 4:37 PM

KBC first woman crorepati had no bank account and PAN card - Sakshi

బాలీవుడ్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌లో ఈ షో విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా ఆగస్టు 14న కౌన్ బనేగా కరోడ్‌పతి 15వ సీజన్ ప్రారంభమైంది. ఈ సారి కూడా బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఎంతోమంది ఈ షోలో పాల్గొని చివరిదాకా నిలిచి కోటీశ్వరులైన వారు కూడా ఉన్నారు. అయితే ఈ షోలో మొదట కోటీ రూపాయలు గెలుచుకున్న మహిళ ఎవరో తెలుసా? ఆమె గురించి వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది కూడా.  ఇంతకీ ఆమె ఎవరు? అసలు ఆమె ఇప్పుడు ఏం చేస్తోంది? ఆమె గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలేంటి? అన్న సందేహం వస్తోంది కదా. అయితే అవేంటో ఓ లుక్కేద్దాం పదండి. 

(ఇది చదవండి:  30 ఏళ్లుగా చిరంజీవికి డూప్‌గా నటించిన ఈ వ్యక్తి గురించి తెలుసా?)

రియాలిటీ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రస్తుతం 15వ సీజన్ ప్రారంభమైంది. అయితే ఈ షో ప్రారంభమైన తర్వాత తొలిసారిగా మహిళ కంటెస్టెంట్‌  కోటి రూపాయలు గెలిచింది.  2010లో కేబీసీ -4 సీజన్‌లో అమితబ్‌ను మెప్పించిన మహిళ రహత్ తస్లీమ్ రూ.కోటి రూపాయలు ప్రైజ్‌మనీ సొంతం చేసుకుంది. జార్ఖండ్‌లోని గిరిదిహ్‌కు చెందిన 37 ఏళ్ల రహత్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి.

రాహత్ పాల్గొన్న సమయంలో రూ. 3.20 లక్షల ప్రశ్న నుంచి రూ. 50 లక్షల ప్రశ్న వరకు ఎలాంటి లైఫ్‌ లైన్‌లు వినియోగించుకోలేదు. ఆ తర్వాత నీపై ఇంత నమ్మకం  ఎక్కడి నుంచి వచ్చిందని బిగ్ బి ప్రశ్నించగా.. అది నా ఆత్మవిశ్వాసం నుంచే పుట్టింది.. నాకు అన్నీ తెలుసు.. అని సమాధానిచ్చినట్లు రాహత్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

అయితే కేబీసీలో పాల్గొనేందుకు మేసేజ్ చేయడానికి తన మొబైల్ ఫోన్‌లో కేవలం రూ. 3 మాత్రమే బ్యాలెన్స్‌ ఉందని తెలిపింది. ఆ డబ్బులతోనే మేసేజ్ పంపినట్లు పేర్కొంది. ఆ తర్వాత తాను ఎంపికవ్వడంతో ముంబయిలో ఆడిషన్ కోసం పిలిచారని వెల్లడించింది. అయితే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ అందరికీ బ్యాంక్ ఖాతా, పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలని చెప్పారని వివరించింది. 

(ఇది చదవండి: రీఎంట్రీలో చిరంజీవి ఆ తప్పులు చేస్తున్నారా?)

అయితే ఆడిషన్స్ ముగిశాక..  ఇంటికి తిరిగి వెళ్లిన వెంటనే నేను చేసిన మొదటి పని బ్యాంక్ ఖాతా తెరిచి పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడమే అని ఆ రోజులను రాహత్ గుర్తుచేసుకుంది. కాగా.. ప్రస్తుతం రాహత్ ఇప్పుడు గిరిదిహ్‌లోని పెద్ద మాల్‌లో దుస్తుల షోరూమ్‌ నిర్వహిస్తోంది. అయితే కోటి రూపాయలు గెలుచుకున్న ఆమె.. బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ లేని స్థితి నుంచి ఏకంగా బిజినెస్‌ చేసే స్థాయికి చేరుకోవడమంటే గొప్ప విషయమే. కౌన్ బనేగా కరోడ్‌పతి వల్ల ఓ సామాన్యురాలు సైతం బిజినెస్‌ వుమెన్‌గా అవతరించింది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement