కౌన్‌ బనేగా కరోడ్‌పతి.. ఒక్క ఎపిసోడ్‌కే రూ.5 కోట్లా? | Amitabh Bachchan Charges RS 5 Crore Per Episode For Hosting KBC 16 | Sakshi
Sakshi News home page

Amitabh Bachchan: కౌన్‌ బనేగా కరోడ్‌పతి.. ఒక్క ఎపిసోడ్‌కు రూ.5 కోట్లు!

Published Wed, Aug 14 2024 8:58 AM | Last Updated on Wed, Aug 14 2024 10:00 AM

Amitabh Bachchan Charges RS 5 Crore Per Episode For Hosting KBC 16

బాలీవుడ్ మెగాస్టార్‌, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ఇటీవలే ప్రభాస్ కల్కి చిత్రంలో కనిపించారు. నాగ్ ‍అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ కీలక పాత్ర పోషించారు. అయితే ప్రస్తుతం ఆయన ప్రముఖ క్విజ్‌ షో కౌన్‌  బనేగా కరోడ్‌పతి సీజన్‌-16కు హౌస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్‌లో ఈ షోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆగస్టు 12న తాజా సీజన్‌ ప్రారంభమైంది.

అయితే ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అమితాబ్‌ పారితోషికం గురించి నెట్టింట చర్చ నడుస్తోంది. ఇందులో ఒక్కో ఎపిసోడ్‌కు ఆయన తీసుకునే రెమ్యునరేషన్‌ ఎంతనే దానిపై ఆడియన్స్ తెగ ఆరా తీస్తున్నారు. బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అమితాబ్‌ భారీగానే పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం ఒక్క ఎపిసోడ్‌కే ఏకంగా రూ. 5 కోట్లు తీసుకుంటున్నారని ఓ నివేదికలో వెల్లడైంది. ఇది గత అన్ని సీజన్‌ల కంటే అత్యధిక రెమ్యునరేషన్‌గా తెలుస్తోంది. 2000 సంవత్సరంలో మొదటి సీజన్‌లో కేవలం రూ.25 లక్షలు తీసుకున్న అమితాబ్‌.. తాజా సీజన్‌లో 5 కోట్లకు పెంచేశారు. గతంలో 14వ సీజన్‌కు అత్యధికంగా రూ.4 కోట్లకు పారితోషికం అందుకున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement