ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనిను ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో ధోని మరో 43 పరుగులు చేస్తే సీఎస్‌కే తరఫున 5000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. సీఎస్‌కే తరఫున 5000 పరుగులు పూర్తి చేసిన ఏకైక ఆటగాడిగా మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా చలామణి అవుతున్నాడు. రైనా సీఎస్‌కే తరఫున 5529 పరుగులు చేశాడు.
రైనా తర్వాత ఈ మైలురాయిని అందుకునేందుకు ధోని రెడీగా ఉన్నాడు. ధోని సీఎస్‌కే తరఫున మొత్తం 4957 పరుగులు సాధించాడు. ఇందులో ఐపీఎల్‌లో చేసినవి 4508 పరుగులు కాగా.. ఛాంపియన్స్ లీగ్‌లో చేసినవి 449 పరుగులు.
రైనా, ధోని తర్వాత సీఎస్‌కే తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుత ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఉన్నాడు. డుప్లెసిస్ సీఎస్‌కే తరఫున 2932 పరుగులు చేశాడు. ఇతని తర్వాత మైక్ హస్సీ (2213), మురళీ విజయ్ (2105) సీఎస్‌కే తరఫున 2000 పరుగుల మార్కును దాటిన వారిలో ఉన్నారు.
ఇదిలా ఉంటే, ఇవాల్టి నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగే సీజన్ తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే.. ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఈ మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు ధోని తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. సీఎస్‌కే సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌కు ధోనినే స్వయంగా కెప్టెన్‌గా ప్రమోట్ చేశాడు. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న విషయం ఆఖరి నిమిషం వరకు సీఎస్‌కే యాజమాన్యానికి కూడా తెలియకపోవడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment