PC: INSIDE SPORT
అబుదాబి టీ10 లీగ్-2022లో టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సురేష్ రైనా భాగం కానున్నారు. ఈ లీగ్‌లో ఢిల్లీ బుల్స్‌తో హర్భజన్ సింగ్ ఒప్పందం కుదుర్చుకోగా.. డిఫెండింగ్ ఛాంపియన్ డెక్కన్ గ్లాడియేటర్స్‌కు రైనా ప్రాతినిధ్యం వహించనున్నాడు. డక్కన్ గ్లాడియేటర్స్ జట్టుకు వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో సారథ్యం వహించనున్నాడు.
అదే విధంగా గ్లాడియేటర్స్ జట్టులో టిమ్ డేవిడ్, రహ్మానుల్లా గుర్బాజ్, విల్ జాక్స్, డొమినిక్ డ్రేక్స్, ఫజల్‌హాక్ ఫరూకీ వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. ఈ జట్టుకు జింబాబ్వే మాజీ ఆటగాడు అండీ ఫ్లవర్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అబుదాబి టీ10 లీగ్ నవంబర్ 3 నుంచి ప్రారంభం కానుంది.
Indian legend Harbhajan Singh has signed for @DelhiBullsT10 and will be joining us in #Season6 of the #AbuDhabiT10 🔒#InAbuDhabi #CricketsFastestFormat pic.twitter.com/d4A8N7DJr2
— T10 League (@T10League) September 29, 2022
ఇక సురేష్ రైనా ప్రస్తుతం రోడ్ సెప్టీ లీగ్‌లో ఇండియా లెజెండ్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. అదే విధంగా హర్భజన్ సింగ్ లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో మణిపాల్ టైగర్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. హార్భజన్ సింగ్ 2021లో అన్ని ఫార్మాట్‌ల క్రికెట్ నుంచి తప్పుకోగా.. రైనా ఇటీవలే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.
చదవండి: T20 WC 2022: 'బుమ్రా స్థానంలో అతడికి అవకాశమివ్వండి'
Comments
Please login to add a commentAdd a comment