టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా ఇటీవలే అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకే రైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పటిలో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.
అబుదాబి టీ10లీగ్‌లో రైనా పాల్గొనున్నాడన్నది ఆ వార్త సారంశం. అంతేకాకుండా ఈ టోర్నీలో దక్కన్ గ్లాడియేటర్స్ తరపున ఆడనున్నుట్లు అతడి అభిమానులు ట్విటర్ వేదికగా హల్‌చల్ చేస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని దైనిక్ జాగరణ్ కూడా తమ నివేదికలో పేర్కొంది.
Suresh Raina will play the Abu Dhabi T10 league!❣️🔥@ImRaina #SureshRaina pic.twitter.com/DOukgFOD8Q
— That's Raina For You (@Thatsrainaforu) September 28, 2022
" నేను ఇంకా రెండు, మూడు ఏళ్లు ఆడాలనుకుంటున్నాను. ఉత్తరప్రదేశ్‌లో దేశీయ జట్టులో ప్రస్తుతం చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. నేను ఉత్తర్ ప్రదేశ్ క్రికెట్ అసోషియషన్ నుంచి అనుమతి దృవీకరణ పత్రం కూడా పొందాను. విదేశీ లీగ్‌లలో ఆడేందకు సముఖత చూపిస్తున్నాను" అని రైనా పేర్కొన్నట్లు దైనిక్ జాగరణ్ వెల్లడించింది. కాగా రైనా ప్రస్తుతం రోడ్‌సెప్టీ లీగ్‌లో ఆడుతున్నాడు.
ఈ ఈవెంట్‌లో మాస్టర్ బ్లస్టర్ సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. ఇక ఇంతకుముందు అబుదాబి టీ10 లీగ్‌లోఅబుదాబి వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, ఎస్ బద్రీనాథ్, రీతీందర్ సింగ్ సోధి, మునాఫ్ పటేల్, యూసుఫ్ పఠాన్, ప్రవీణ్ కుమార్ వంటి భారత మాజీ ఆటగాళ్లు భాగమయ్యారు.
చదవండి: Ind Vs SA: అతడు అద్భుతమైన ఆటగాడు.. కానీ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు.. అయినా: గంగూలీ
Comments
Please login to add a commentAdd a comment