తండ్రి త్రిలోక్‌చంద్ రైనాతో టీమిండియా మాజీ క్రికెటర్
Former Indian Cricketer Suresh Raina Father Passed Away.. టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఇంట్లో తీవ్ర విషాధం నెలకొంది. రైనా తండ్రి త్రిలోక్‌చంద్ రైనా ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఘజియాబాద్‌లోని తన ఇంట్లో మృతి చెందారు. కాగా రైనా తండ్రి మిలటరీలో సేవలందించారు. బాంబులు తయారు చేయడంలో త్రిలోక్‌చంద్ రైనా దిట్ట. రైనా పూర్వీకులు జమ్మూ కశ్మీర్‌లోని రైనావారీ గ్రామానికి చెందినవారు. రైనా చిన్నతనంలోనే అతని కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాద్‌నగర్‌లో స్థిరపడ్డారు.
ఇక సురేశ్ రైనా 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. టీమిండియాలో ఒక దశాబ్ధం పాటు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా కీలకపాత్ర పోషించాడు. టీమిండియా తరపున 226 వన్డేలు, 78 టి20లు, 18 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గా రైనా పేరు సంపాధించాడు. రైనా ఐపీఎల్‌లో ఎక్కువకాలం సీఎస్‌కేకు ఆడాడు. ఈసారి రైనాను సీఎస్‌కే రిలీజ్ చేయడంతో ఇక ఫిబ్రవరి 12,13 తేదీల్లో జరగనున్న మెగావేలంలో ఏ జట్టు సొంతం చేసుకుంటుందో చూడాలి. వేలంలో రైనాను లక్నో సూపర్‌జెయింట్స్ సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
చదవండి: Under-19 World Cup Final: మనోడు ఎన్నాళ్లకెన్నాళ్లకు..ఒకే ఒక్కడిగా రికార్డు!
Under-19 World Cup Final: 'నీ ఆట అమోఘం.. ప్రత్యర్థివైనా మెచ్చుకోకుండా ఉండలేం'
Comments
Please login to add a commentAdd a comment