శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరుగుతున్న లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ 2024 ఎడిషన్‌లో ఇవాళ (మార్చి 11) ఢిల్లీ డెవిల్స్, న్యూయార్క్ సూపర్ స్టార్ స్ట్రయికర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ యువరాజ్ సింగ్ సారధ్యం వహించిన న్యూయార్క్ జట్టు.. సురేశ్ రైనా నాయకత్వంలోని ఢిల్లీ డెవిల్స్‌ను 50 పరుగుల తేడాతో ఓడించింది.
తిరిమన్నే విశ్వరూపం..
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూయార్క్.. లంక ఆటగాడు లహీరు తిరిమన్నే (39 బంతుల్లో 90; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించడంతో నిర్ణీత 15 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. న్యూయార్క్ ఇన్నింగ్స్‌లో తిరిమన్నే మినహా ఎవరూ రాణించలేదు. ఢిల్లీ బౌలర్లలో అనురీత్ సింగ్, మల్హోత్రా తలో 2 వికెట్లు పడగొట్టగా.. అబ్దుల్లా, అమితోజ్‌సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
సురేశ్ రైనా పోరాటం వృధా..
186 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. సురేశ్ రైనా (35 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చివరివరకు అజేయంగా నిలిచాడు. ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న అంబటి రాయుడు (19) నిరాశపరిచాడు. న్యూయార్క్ బౌలర్లలో ఉదాన 3 వికెట్లు పడగొట్టగా.. రాహుల్ శర్మ, గ్రాండ్‌హోమ్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment