Lahiru Thirimanne
-
Car Accident: టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ క్రికెటర్‌కు గాయాలు
శ్రీలంక మాజీ క్రికెటర్ లాహిరు తిరిమన్నె, అతడి కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అనురాధపుర సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టడంతో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో తిరిమన్నెతో పాటు అతడి ఫ్యామిలీ కూడా గాయపడినట్లు న్యూయార్క్ స్ట్రైకర్స్ వెల్లడించింది. ప్రస్తుతం వీరంతా క్షేమంగా ఉన్నట్లు పేర్కొంది. కాగా 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన లెఫ్టాండర్ బ్యాటర్ తిరిమన్నె లంక తరఫున 44 టెస్టులు, 127 వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 2088, 3164, 291 పరుగులు చేశాడు. కెరీర్లో మొత్తంగా మూడు టీ20 వరల్డ్‌కప్ ఈవెంట్లలో పాల్గొన్న లాహిరు తిరిమన్నె.. 2014లో టైటిల్ గెలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడు కూడా! అదే విధంగా ఐదు వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్‌గానూ వ్యవహరించిన అనుభవం అతడికి ఉంది. రెండు వన్డే ప్రపంచకప్ టోర్నీల్లోనూ భాగమయ్యాడు. ఇక గతేడాది ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన లాహిరు తిరిమన్నె ప్రస్తుతం లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ 2024 ఈవెంట్లో భాగమైన అతడు.. న్యూయార్క్ స్ట్రైకర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం క్యాండీ స్యాంప్ ఆర్మీతో జరిగిన మ్యాచ్‌లోనూ లాహిరు తిరిమన్నె ఆడాడు. 14 బంతులు ఎదుర్కొని 18 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే, మ్యాచ్ అనంతరం కుటుంబానికి సమయం కేటాయించిన తిరిమన్నె గుడికి వెళ్లే క్రమంలో కారు ప్రమాదానికి గురయ్యాడు. లారీని ఢీకొన్న ఘటనలో అతడి కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే, అదృష్టవశాత్తూ లాహిరు తిరిమన్నెతో పాటు అతడి కుటుంబం కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 🚨UPDATE🚨 Lahiru Thirimanne, former Sri Lankan cricketer, hospitalized after a road accident in Thrippane, Anuradhapura.#LahiruThirimanne #SriLanka #Icc #Cricket pic.twitter.com/qqpuYcZ8h5 — Cricadium CRICKET (@Cricadium) March 14, 2024 -
శ్రీలంక ఆటగాడి ఉగ్రరూపం.. సురేశ్ రైనా పోరాటం వృధా
శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరుగుతున్న లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ 2024 ఎడిషన్‌లో ఇవాళ (మార్చి 11) ఢిల్లీ డెవిల్స్, న్యూయార్క్ సూపర్ స్టార్ స్ట్రయికర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ యువరాజ్ సింగ్ సారధ్యం వహించిన న్యూయార్క్ జట్టు.. సురేశ్ రైనా నాయకత్వంలోని ఢిల్లీ డెవిల్స్‌ను 50 పరుగుల తేడాతో ఓడించింది. తిరిమన్నే విశ్వరూపం.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూయార్క్.. లంక ఆటగాడు లహీరు తిరిమన్నే (39 బంతుల్లో 90; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించడంతో నిర్ణీత 15 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. న్యూయార్క్ ఇన్నింగ్స్‌లో తిరిమన్నే మినహా ఎవరూ రాణించలేదు. ఢిల్లీ బౌలర్లలో అనురీత్ సింగ్, మల్హోత్రా తలో 2 వికెట్లు పడగొట్టగా.. అబ్దుల్లా, అమితోజ్సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. సురేశ్ రైనా పోరాటం వృధా.. 186 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. సురేశ్ రైనా (35 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చివరివరకు అజేయంగా నిలిచాడు. ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న అంబటి రాయుడు (19) నిరాశపరిచాడు. న్యూయార్క్ బౌలర్లలో ఉదాన 3 వికెట్లు పడగొట్టగా.. రాహుల్ శర్మ, గ్రాండ్‌హోమ్ తలో వికెట్ పడగొట్టారు. -
SL VS PAK: రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక క్రికెటర్
శ్రీలంక ఓపెనింగ్ బ్యాటర్ లహిరు తిరిమన్నే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు శనివారం ప్రకటించాడు. గత ఏడాది కాలంగా సరైన అవకాశాలు రాకపోవడంతో తిరిమన్నే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లంక వన్డే జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన తిరిమన్నే 2010లో అంతర్జాతీయ క్రికెట్లోని అరంగేట్రం చేసి, దాదాపు 13 ఏళ్ల పాటు లంక క్రికెట్‌కు సేవలందించాడు. తిరిమన్నే తన కెరీర్లో 44 టెస్ట్‌లు, 127 వన్డేలు, 26 టీ20లు ఆడాడు. ఇందులో దాదాపు 5600 పరుగులు చేశాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన తిరిమన్నే.. తన కెరీర్లో 3 టెస్ట్ సెంచరీలు, 4 వన్డే సెంచరీలతో పాటు అన్ని ఫార్మాట్లలో కలిపి 31 అర్ధసెంచరీలు సాధించాడు. తిరిమన్నే చివరిగా 2022లో బెంగళూరు వేదికగా భారత్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆడాడు. Lahiru Thirimanne announces his retirement from cricket. We wish him all the best for his new journey. pic.twitter.com/TygWD5iwzg — CricTracker (@Cricketracker) July 22, 2023 ఆ మ్యాచ్‌లో 0, 8 పరుగులకే పరిమితమైన అతను జట్టులో స్థానంలో కోల్పోయాడు. తిరిమన్నే తన రిటైర్మెంట్ ప్రకటనను ఇన్‌స్టా వేదికగా షేర్ చేశాడు. 13 ఏళ్ల పాటు దేశానికి ప్రాతినిథ్యం వహించడం గర్వకారణమని పేర్కొన్నాడు. లంక జట్టుతో తన జర్నీలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ఇదిలా ఉంటే, శ్రీలంక జట్టు ప్రస్తుతం స్వదేశంలో పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. సిరీస్‌లో భాగంగా ఇటీవల ముగిసిన తొలి టెస్ట్‌లో శ్రీలంక.. పాక్ చేతిలో ఓటమిపాలైంది. దీనికి ముందు జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో శ్రీలంక ఛాంపియన్‌గా నిలిచి, ఈ ఏడాది చివర్లో భారత్ వేదకగ జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించింది. -
SL vs BAN: శ్రీలంక భారీ స్కోరు
పల్లెకెలె: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక భారీ స్కోరు చేసింది. ఆట రెండో రోజు ఓవర్‌నైట్ స్కోరు 291/1తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక శుక్రవారం వెలుతురు మందగించి ఆట నిలిపి వేసే సమయానికి 155.5 ఓవర్లలో ఆరు వికెట్లకు 469 పరుగులు సాధించింది. వెలుతురులేమి కారణంగా రెండో రోజు కేవలం 65.5 ఓవర్ల ఆట సాధ్యపడింది. ఓపెనర్ తిరిమన్నె (140; 15 ఫోర్లు) తన ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరుకు మరో తొమ్మిది పరుగులు జోడించి అవుటయ్యాడు. ఇక సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఒషాడా ఫెర్నాండో (81; 8 ఫోర్లు) పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం నిరోషన్ డిక్వెలా (64 బ్యాటింగ్; 7 ఫోర్లు), రమేశ్ మెండిస్ (22 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు తీశాడు. చదవండి: పదేళ్ల తర్వాత శ్రీలంక ఓపెనర్లు తొలిసారిగా.. -
పదేళ్ల తర్వాత శ్రీలంక ఓపెనర్లు తొలిసారిగా..
పల్లెకెలె: బంగ్లాదేశ్‌తో ఆరంభమైన రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన శ్రీలంకను ఓపెనర్లు దిముత్ కరుణత్నే (190 బంతుల్లో 118, 15 ఫోర్లు), లహిరు తిరిమన్నె (253 బంతుల్లో 131 బ్యాటింగ్; 14 ఫోర్లు) సెంచరీలతో ముందుకు నడిపించారు. దాంతో తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో వికెట్ నష్టపోయి 291 పరుగులు చేసింది. కరుణరత్నే, తిరిమన్నె తొలి వికెట్‌కు 209 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 2011 తర్వాత శ్రీలంక ఓపెనర్లు నెలకొల్పిన తొలి డబుల్ సెంచరీ భాగస్వామ్యం ఇదే. కాగా... స్వదేశంలో 21 ఏళ్ల తర్వాత ఈ ఘనతను సాధించడం విశేషం. కరుణరత్నే 165 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కెరీర్లో అతడికిది 12వ శతకం. అంతేకాకుండా టెస్టుల్లో 5 వేల పరుగుల మైలురాయిని కూడా అతను అందుకున్నాడు. మరో ఓపెనర్ తిరిమన్నె 212 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి రోజు ఆటలో 90 ఓవర్ల పాటు చెమటోడ్చిన బంగ్లాదేశ్ బౌలర్లు కేవలం కరుణరత్నే వికెట్‌తోనే సంతృప్తి పడ్డారు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఒషాడా ఫెర్నాండో (98 బంతుల్లో 40 బ్యాటింగ్; 4 ఫోర్లు) కూడా కుదురుగా ఆడాడు. ఫెర్నాండోతో కలిసి తిరిమన్నె అభేద్యమైన రెండో వికెట్‌కు 82 పరుగులు జోడించాడు. చదవండి: కరుణరత్నే అజేయ డబుల్ సెంచరీ -
'అతడే నంబర్ వన్'
వెల్లింగ్టన్: పరిమిత ఓవర్ల క్రికెట్ లో కుమార సంగక్కరను మించినవాడు లేడంటూ శ్రీలంక బ్యాట్స్ మన్ లాహిరు తిరిమన్నె ఆకాశానికెత్తాడు. అత్యుత్తమ ఆటగాళ్లలో అతడొక్కడని కితాబిచ్చాడు. వరుసగా రెండు మ్యాచుల్లో సంగక్కర రెండు సెంచరీలు సాధించాడు. ఇంగ్లండ్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో సంగక్కర(117) సెంచరీతో నాటౌట్ గా నిలిచాడు. అంతకుముందు బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 105 పరుగులు సాధించాడు. 402 వన్డే మ్యాచులు ఆడిన సంగక్కర ఇప్పటివరకు 24 సెంచరీలు సాధించాడు. ఎంతో అనుభవం ఉన్న సంగక్కర జట్టును ప్రభావితం చేయగలడని తిరిమన్నె అన్నాడు. అతడు నంబర్ వన్ ఆటగాడని, అతని బ్యాటింగ్ చాలా బాగుంటుందని ప్రశంసించాడు. స్ట్రైక్ రొటేట్ చేయడమే కాకుండా బౌండరీలు బాదడంలోనూ దిట్టని తెలిపాడు. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ తిరిమన్నె(139) కూడా అజేయ శతకం బాదాడు.