టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ క్రికెటర్‌కు గాయాలు(PC: X)
శ్రీలంక మాజీ క్రికెటర్ లాహిరు తిరిమన్నె, అతడి కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అనురాధపుర సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టడంతో ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
గురువారం జరిగిన ఈ ప్రమాదంలో తిరిమన్నెతో పాటు అతడి ఫ్యామిలీ కూడా గాయపడినట్లు న్యూయార్క్ స్ట్రైకర్స్ వెల్లడించింది. ప్రస్తుతం వీరంతా క్షేమంగా ఉన్నట్లు పేర్కొంది. కాగా 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన లెఫ్టాండర్ బ్యాటర్ తిరిమన్నె లంక తరఫున 44 టెస్టులు, 127 వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
ఆయా ఫార్మాట్లలో వరుసగా 2088, 3164, 291 పరుగులు చేశాడు. కెరీర్‌లో మొత్తంగా మూడు టీ20 వరల్డ్‌కప్ ఈవెంట్లలో పాల్గొన్న లాహిరు తిరిమన్నె.. 2014లో టైటిల్ గెలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడు కూడా! అదే విధంగా ఐదు వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్‌గానూ వ్యవహరించిన అనుభవం అతడికి ఉంది. రెండు వన్డే ప్రపంచకప్ టోర్నీల్లోనూ భాగమయ్యాడు.
ఇక గతేడాది ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన లాహిరు తిరిమన్నె ప్రస్తుతం లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ 2024 ఈవెంట్లో భాగమైన అతడు.. న్యూయార్క్ స్ట్రైకర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
ఈ క్రమంలో బుధవారం క్యాండీ స్యాంప్ ఆర్మీతో జరిగిన మ్యాచ్‌లోనూ లాహిరు తిరిమన్నె ఆడాడు. 14 బంతులు ఎదుర్కొని 18 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే, మ్యాచ్ అనంతరం కుటుంబానికి సమయం కేటాయించిన తిరిమన్నె గుడికి వెళ్లే క్రమంలో కారు ప్రమాదానికి గురయ్యాడు. లారీని ఢీకొన్న ఘటనలో అతడి కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే, అదృష్టవశాత్తూ లాహిరు తిరిమన్నెతో పాటు అతడి కుటుంబం కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
🚨UPDATE🚨
— Cricadium CRICKET (@Cricadium) March 14, 2024
Lahiru Thirimanne, former Sri Lankan cricketer, hospitalized after a road accident in Thrippane, Anuradhapura.#LahiruThirimanne #SriLanka #Icc #Cricket pic.twitter.com/qqpuYcZ8h5
Comments
Please login to add a commentAdd a comment