వేతనాల విషయమై బోర్డుతో నెలకొన్న వివాదం పరిష్కారం కాకపోవడంతో శ్రీలంక ఆటగాళ్లు కాంట్రాక్టులపై సంతకాలు చేయకుండానే టి20 ప్రపంచకప్‌లో ఆడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదివారం వారు బంగ్లాదేశ్‌కు బయల్దేరనున్నారు.
కొలంబో: వేతనాల విషయమై బోర్డుతో నెలకొన్న వివాదం పరిష్కారం కాకపోవడంతో శ్రీలంక ఆటగాళ్లు కాంట్రాక్టులపై సంతకాలు చేయకుండానే టి20 ప్రపంచకప్‌లో ఆడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదివారం వారు బంగ్లాదేశ్‌కు బయల్దేరనున్నారు.
ఐసీసీ నుంచి వచ్చే మొత్తంలో తమకు 20 శాతం చెల్లించాలని శ్రీలంక బోర్డు (ఎస్‌ఎల్‌సీ)ను ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు నిరాకరించిన ఎస్‌ఎల్‌సీ.. కొత్త ఫార్ములాను ఆటగాళ్ల ముందుంచింది. దీని ప్రకారం ఆటగాళ్లకు ఆరు శాతం మాత్రమే దక్కనుంది. అయితే వారు బెట్టు వీడకపోవడంతో టి20 ప్రపంచకప్‌కు ద్వితీయ శ్రేణి జట్టును పంపిస్తామని ఎస్‌ఎల్‌సీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆటగాళ్లు వేతనాల విషయాన్ని పెండింగ్‌లోనే ఉంచి బంగ్లాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.