కుమార సంగక్కర(ఫైల్)
వెల్లింగ్టన్: పరిమిత ఓవర్ల క్రికెట్ లో కుమార సంగక్కరను మించినవాడు లేడంటూ శ్రీలంక బ్యాట్స్ మన్ లాహిరు తిరిమన్నె ఆకాశానికెత్తాడు. అత్యుత్తమ ఆటగాళ్లలో అతడొక్కడని కితాబిచ్చాడు. వరుసగా రెండు మ్యాచుల్లో సంగక్కర రెండు సెంచరీలు సాధించాడు. ఇంగ్లండ్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో సంగక్కర(117) సెంచరీతో నాటౌట్ గా నిలిచాడు. అంతకుముందు బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 105 పరుగులు సాధించాడు. 402 వన్డే మ్యాచులు ఆడిన సంగక్కర ఇప్పటివరకు 24 సెంచరీలు సాధించాడు.
ఎంతో అనుభవం ఉన్న సంగక్కర జట్టును ప్రభావితం చేయగలడని తిరిమన్నె అన్నాడు. అతడు నంబర్ వన్ ఆటగాడని, అతని బ్యాటింగ్ చాలా బాగుంటుందని ప్రశంసించాడు. స్ట్రైక్ రొటేట్ చేయడమే కాకుండా బౌండరీలు బాదడంలోనూ దిట్టని తెలిపాడు. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ తిరిమన్నె(139) కూడా అజేయ శతకం బాదాడు.