లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో తొలి సెంచరీ నమోదైంది. తొయమ్ హైదరాబాద్‌తో ఇవాళ (సెప్టెంబర్ 23) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ గ్రేట్స్ ఓపెనర్ మోర్నీ వాన్ విక్ మెరుపు శతకం సాధించాడు. వాన్ విక్ 69 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా సురేశ్ రైనా సారథ్యం వహిస్తున్న తొయమ్ హైదరాబాద్‌పై శిఖర్ ధవన్ జట్టు గుజరాత్ గ్రేట్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 27 బంతుల్లో 44 పరుగులు చేసిన సురేశ్ రైనా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పీటర్ ట్రెగో 36 (నాటౌట్), గుర్కీరత్ సింగ్ 26, వాల్టన్ 17, క్లార్క్ 15, వర్కర్ 13 పరుగులు చేశారు. షాన్ మార్ష్ (1), స్టువర్ట్ బిన్ని (7) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. గుజరాత్ బౌలర్లలో ప్లంకెట్, మనన్ శర్మ, ప్రసన్న తలో రెండు వికెట్లు తీయగా.. గాబ్రియెల్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. వాన్ విక్ మెరుపు సెంచరీతో చెలరేగడంతో 19.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. వాన్ విక్ ఒంటిరి పోరాటం చేయగా.. శిఖర్ ధవన్ (21), లెండిల్ సిమన్స్ (20), యశ్‌పాల్ శర్మ (13 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో ఇసురు ఉడాన, గుర్కీరత్ మాన్ తలో వికెట్ పడగొట్టారు.
చదవండి: రసవత్తరంగా సాగుతున్న న్యూజిలాండ్, శ్రీలంక టెస్ట్ మ్యాచ్
Comments
Please login to add a commentAdd a comment