
ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్, కేకేఆర్ ఫినిషిర్ రింకూ సింగ్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఈడెన్ గార్డన్స్ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో యశస్వీ జైశ్వాల్ మరో సారి చెలరేగిపోయాడు. కేవలం కేవలం 13 బంతుల్లోనే జైశ్వాల్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్న జైశ్వాల్.. ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ ఫీప్టి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 47 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 13 ఫోర్లు, 5 సిక్సర్లతో 98 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఏడాది సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన జైశ్వాల్ 575 పరుగులు సాధించాడు. ఇక రింకూ సింగ్ విషయానికి వస్తే.. లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి కేకేఆర్‌కు అద్భుతమైన విజయాలను అందిస్తున్నాడు.
ముఖ్యంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది కేకేఆర్‌కు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన రింకూ సింగ్.. 353 పరుగులు చేశాడు.
జైశ్వాల్, రింకూ ప్రపంచకప్‌లో ఆడాలి
ఇక అద్భతమైన ఫామ్‌లో ఉన్న జైశ్వాల్, రింకూ సింగ్ వన్డే ప్రపంచకప్-2023లో ఆడాలని భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ డిజిటల్ బ్రాడ్‌కాస్టర్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న రైనా..రాజస్తాన్, కేకేఆర్ మ్యాచ్ సందర్భంగా ఈ వాఖ్యలు చేశాడు.
చదవండి: #Nitish Rana: తొలి ఓవర్లోనే 26 పరుగులు.. అంతమంది ఉన్నా! తప్పు చేశాను! మరేం పర్లేదు.. ఒకవేళ
Comments
Please login to add a commentAdd a comment