సురేశ్‌ రైనా అరుదైన ఘనత | IPL 2021: Raina Becomes 2nd CSK Player After Dhoni To Play 200 Matches | Sakshi
Sakshi News home page

సురేశ్‌ రైనా అరుదైన ఘనత

Published Sat, May 1 2021 8:11 PM | Last Updated on Sat, May 1 2021 8:11 PM

IPL 2021: Raina Becomes 2nd CSK Player After Dhoni To Play 200 Matches - Sakshi

Photo Courtesy: BCCI/PTI

ఢిల్లీ:  చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు సురేశ్‌ రైనా అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌ ఆడుతున్న రెండో క్రికెటర్‌గా రికార్డు పుస్తకాల్లోకెక్కాడు.  ఈ ఫీట్‌ను  సాధించిన తొలి సీఎస్‌కే క్రికెటర్‌  ఎంఎస్‌ ధోని, ఆ తర్వాత స్థానంలో రైనా నిలిచాడు. ముంబై ఇండియన్స్‌తో శనివారం(మే 1వతేదీ) జరుగుతున్న మ్యాచ్‌ ద్వారా రైనా ఈ ఫీట్‌ను  సాధించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 200వ మ్యాచ్‌లు ఆడిన  నాల్గో ప్లేయర్‌గా రైనా గుర్తింపు పొందాడు.  

అంతకుముందు రోహిత్‌ శర్మ, దినేశ్‌ కార్తీక్‌లు కూడా 200 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లు. కాగా, విరాట్‌ కోహ్లి 200వ ఐపీఎల్‌ మ్యాచ్‌కు అడుగుదూరంలో ఉన్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో వచ్చే వారం జరుగనున్న మ్యాచ్‌లో కోహ్లి ఈ మైలురాయిని చేరుకోనున్నాడు. ప్రస్తుతం కోహ్లి 199 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఐపీఎల్‌లో రైనా ఇప్పటికే ఒక ఘనతను నమోదు చేశాడు. ఐపీఎల్‌లో 200 సిక్సర్లు బాదిన 7వ క్రికెటర్‌గా నిలిచాడు. మార్చి 19వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రైనా రెండు సిక్స్‌లు కొట్టడం ద్వారా 200 సిక్సర్ల మార్కును చేరాడు. వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో రైనా ఆ రెండు సిక్స్‌లను కొట్టాడు. 

ఇక్కడ చదవండి: చీకటి రోజుల్ని గుర్తుచేసుకున్న రసెల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement