ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జాసన్ రాయ్ బయో-బబుల్ నిబంధనల కారణంగా ఐపీఎల్-2022 నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ మెగా వేలంలో రాయ్‌ను రూ. 2 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. అయితే రాయ్ జట్టుకు దూరం కావండంతో అతడి స్ధానంలో వేలంలో అమ్ముడుపోని సురేష్ రైనాను భర్తీ చేస్తారని వార్తలు వినిపించాయి.
అయితే ఈ వార్తలు అన్నీ ఆవాస్తవమని, గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే వేరే ఆటగాడితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘానిస్తాన్ విధ్వంసకర ఓపెనర్ రహ్మెనుల్లా గుర్భాజ్‌ను రాయ్ స్ధానంలో తీసుకుంటున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన గుజరాత్ టైటాన్స్ త్వరలో చేయనుంది. గుర్బాజ్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు ఫ్రాంచైజీ లీగ్‌ల్లో ఆడుతున్నాడు.
ఇప్పటి వరకు18 అంతర్జాతీయ టీ20 మ్యాచులు ఆడిన రహ్మెనుల్లా గుర్భాజ్ 531 పరుగులు చేశాడు. ఇక ఇటీవల ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఇస్లామాబాద్ యూనైటడ్ జట్టుకు ప్రాతనిథ్యం వహించిన గుర్బాజ్.. 6 మ్యాచ్‌ల్లో 139 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌లో కొత్త జట్టుగా అవతరించిన గుజరాత్ టైటాన్స్ హార్ధిక్ పాండ్యా సారథ్యం వహించ నున్నాడు. గుజరాత్ టైటాన్స్ తమ తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఇక ఐపీఎల్-2022 వాంఖడే వేదికగా మార్చి 26 నుంచి ఫ్రారంభం కానుంది.
చదవండి: Rohit Sharma: కలలో కూడా ఊహించలేదు.. నాకు దక్కిన గొప్ప గౌరవం ఇది: రోహిత్ శర్మ భావోద్వేగం
Comments
Please login to add a commentAdd a comment