కర్టసీ: బీసీసీఐ
ముంబై: చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా తన విలువేంటో మరోసారి చూపించాడు. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్‌కు రైనా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సీఎస్‌కేను తన మెరుపు ఇన్నింగ్స్‌తో నిలబెట్టాడు. కాగా 36 బంతులెదుర్కొన్న రైనా 54 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో మిడ్‌వికెట్ దిశగా కొట్టిన సిక్సర్ ఇన్నింగ్స్‌కే హైలెట్‌గా నిలిచింది.మొదట మొయిన్ అలీ, ఆ తర్వాత అంబటి రాయుడుతో కలిసి సీఎస్‌కే ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసిన రైనా జడేజాతో సమన్వయ లోపం కారణంగా దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. కాగా సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. చివర్లో సామ్ కరన్ 15 బంతుల్లోనే 34 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో సీఎస్‌కే భారీ స్కోరు నమోదు చేసింది.
చదవండి: 78 ఇన్నింగ్స్‌ల తర్వాత ఇలా ఔటయ్యాడు..!
Comments
Please login to add a commentAdd a comment